సినిమా ఇండస్ట్రీలో వారసులు రావడం అనేది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది.ఇక ఒక ఫ్యామిలీ నుంచి హీరో వచ్చాడంటే అదే ఫ్యామిలీ నుంచి వాళ్ళ కొడుకులు గాని, తమ్ముళ్లు గాని హీరోలుగా రావడం ఎప్పటి నుంచో ఆనవాయితిగా జరుగుతుంది.
ఇక ఇది ఇలా ఉంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ డూపర్ సక్సెస్ ను అందుకున్న కమల్ హాసన్ తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు.ఇక దాంతో తన కూతురు అయిన శ్రుతి హాసన్ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఇక శ్రుతి హాసన్ ను ఇండస్ట్రీ కి తీసుకురావడం అనేది అప్పట్లో పెద్ద చర్చగా మారింది.

ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా రావడం అంటే పర్లేదు కానీ హీరోయిన్ల విషయంలో మాత్రం చాలా మందికి చాలా అపోహలైతే ఉంటాయి.ఇక అలాంటి సమయంలో కమలహాసన్( Kamal Haasan ) ఎందుకు తన కూతురిని సినిమా రంగంలోకి తీసుకు వచ్చారని మరి కొంతమంది కూడా ఆయన మీద విమర్శలను కూడా చేశారు.అయినప్పటికీ శృతిహాసన్( Shruti Haasan ) మాత్రం తనకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని అందువల్లే ఆమె ఇండస్ట్రీ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చానని చాలాసార్లు సమాధానం అయితే చెప్పారు.
ఇక ఇదిలా ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కమలహాసన్ శృతిహాసన్ ను అసలు పట్టించుకోవడంలేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఇక కమల్ హాసన్ తన తోటి నటి అయిన సారిక( Sarika ) ను పెళ్లి చేసుకోవడం వల్ల ఇద్దరికీ శృతిహాసన్, అక్షర హాసన్ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు.ఇక అందులో వీళ్లిద్దరూ కూడా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.కానీ కమలహాసన్ మాత్రం శృతిహాసన్ సినిమాల్లో అసలు ఇన్వాల్వ్ అవ్వడంట.తనకు నచ్చిన సినిమాని, నచ్చిన క్యారెక్టర్ని చేసుకోమని చెప్తూ ఉంటాడట.ఇక అందువల్లే శృతిహాసన్ ఎలాంటి గ్లామర్ రోలైన సరే ఈజీగా చేసేస్తూ ఉంటుంది…
.







