తెలంగాణ బీజేపీలో( Telangana BJP ) బీఆర్ఎస్ నేతల చేరికలు కాక రేపుతున్నాయి.తాజాగా కమల తీర్థం పుచ్చుకున్న నగేశ్, సైదిరెడ్డి చేరికను బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది.
నగేశ్ ను( Nagesh ) బీజేపీలో చేర్చుకోవడంపై ఆదిలాబాద్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు( Soyam Bapurao ) మహేశ్వర్ రెడ్డి, రామారావు పాటిల్, పాల్వాయి హరీశ్ మద్ధతు పలుకుతున్నారు.
ఈ క్రమంలోనే మరి కాసేపట్లో బీఎల్ సంతోష్ ను ఆదిలాబాద్ నేతలు కలవనున్నారు.బీఎస్ సంతోష్( BL Santhosh ) ఇచ్చే సమాధానం ఆధారంగా బీజేపీ నాయకులు తమ తదుపరి కార్యాచరణను ప్రకటించనున్నారు.
ఈ నేపథ్యంలోనే బీజేపీ కార్యకర్తలపై రాళ్ల దాడులు చేయించి, అక్రమ కేసులు పెట్టించిన వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.మరోవైపు సైదిరెడ్డి చేరికపై కూడా బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.సైదిరెడ్డి( Saidireddy ) చేరికను బండి సంజయ్ వ్యతిరేకిస్తుండగా.కిషన్ రెడ్డి కూడా సైదిరెడ్డి చేరిక ఇష్టం లేకనే నిన్న హైదరాబాద్ వచ్చారని పార్టీలో చర్చ జోరుగా సాగుతోంది.
దీంతో రాష్ట్ర బీజేపీలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంది.