టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్రంగా ఫైరయ్యారు.పథకాలతో రాష్ట్రం దివాలా తీసిందని విమర్శించిన చంద్రబాబు మరిన్ని పథకాలు ఇస్తానంటున్నారని పేర్కొన్నారు.
ఎప్పటికప్పుడు చంద్రబాబు మాట మారుస్తున్నారని మండిపడ్డారు.జగన్ పని అయిపోతే టీడీపీ ఎందుకు పొత్తులు పెట్టుకుందని ప్రశ్నించారు.
జనసేన, బీజేపీ పంచన ఎందుకు చేరారో చెప్పాలన్నారు.అయితే ఎన్ని పార్టీలు కలిసినా జగన్ కు తిరుగులేదన్న ఆయన వచ్చే ఎన్నికల్లో మరోసారి జగనే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.