స్టార్ హీరోయిన్ సౌందర్య మరణించి చాలా సంవత్సరాలు అవుతున్నా ఆమెను ఈతరం ప్రేక్షకులు సైతం ఎంతో అభిమానిస్తున్నారు.సీనియర్ నటుడు సురేష్ ఒక ఇంటర్వ్యూలో సౌందర్య గురించి షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.
సురేష్, సౌందర్య( Suresh ) కాంబినేషన్ లో ఎక్కువ సంఖ్యలో సినిమాలు వచ్చాయి.సౌందర్య యాటిట్యూడ్ గురించి సురేష్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అమ్మోరు సినిమాలో నటించే సమయానికి సౌందర్యకు తెలుగు రాదని ఆ సమయంలో డైలాగ్స్ పలకడం ఇబ్బందిగా అనిపించి డైలాగ్స్ విషయంలో నా సహాయం కోరేదని సురేష్ కామెంట్లు చేశారు.సౌందర్య అమ్మోరు సినిమా(Ammoru )లో నటించే సమయంలో ఎంతో అణుకువతో ఉన్నారని ఆమె చాలా సింపుల్ గా ఉండేదని నటన అంటే సౌందర్యకు ఎంతో ఫ్యాషన్ అని సురేష్ అభిప్రాయపడ్డారు.

సౌందర్య చాలా హార్డ్ వర్క్ చేసేదని ఆయన అన్నారు.అమ్మోరు మూవీ పూర్తయ్యే సమయానికి సౌందర్య బాగా తెలుగు నేర్చుకుందని ఆయన పేర్కొన్నారు.అమ్మోరు రిలీజయ్యే సమయానికి సౌందర్య స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుందని సురేష్ చెప్పుకొచ్చారు.చివరిగా దేవీపుత్రుడు సినిమాలో సౌందర్యతో కలిసి నటించానని ఆయన కామెంట్లు చేశారు.
స్టార్ డమ్ వస్తే ఎవరికైనా యాటిట్యూడ్ మారిపోతుందని కానీ సౌందర్య( Soundarya ) మాత్రం స్టార్ డమ్ వచ్చిన తర్వాత కూడా మారకుండా ఉన్నారని సురేష్ కామెంట్లు చేశారు.సురేష్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
సౌందర్య భౌతికంగా మరణించినా తమ హృదయాల్లో జీవించి ఉన్నారని సౌందర్య లాంటి హీరోయిన్లు ఈతరం ఇండస్ట్రీలో లేరని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతుండగా ఆ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అప్పటి స్టార్ హీరోలందరికీ సౌందర్య జోడీగా నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించడం గమనార్హం.







