ఇక ప్రపంచం మొత్తం ఐపీఎల్ 17 సీజన్ కోసం ఎదురుచూస్తుంది.ఇక ఈనెల 22వ తేదీ నుంచి జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ ల కోసం ప్రతి ఒక్క క్రికెట్ ప్రేక్షకుడు ఎదురుచూస్తున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం గుజరాత్ టీం ( Gujarat Team )కెప్టెన్సీ బాధ్యతలను శుభ్ మన్ గిల్( Shubman Gill ) నిర్వహించబోతున్నాడు.ఇప్పటివరకైతే గిల్ కి కెప్టెన్సీ చేసిన అనుభవం పెద్దగా లేదు.
ఏ నమ్మకంతో గుజరాత్ టీం గిల్ ని కెప్టెన్ గా నియమిస్తున్నారు అనే అంశాలు కూడా వెల్లడవుతున్నాయి.మొత్తానికైతే రెండు సీజన్లలో ఒకసారి టైటిల్ విన్నర్ గా, మరొకసారి రన్నరప్ గా నిలిచిన గుజరాత్ ఇప్పుడు మరోసారి టైటిల్ ని గెలవాలని చూస్తున్నారు.

ఇక హార్దిక్ పాండ్యా( Hardik Pandya ) టీం నుంచి వెళ్లిపోయిన తర్వాత గుజరాత్ ఉన్న గిల్ మాత్రమే కెప్టెన్సీ చేయగల సమర్థుడని భావించిన యాజమాన్యం ఆయనకు కీలక బాధ్యతలను అప్పగించింది.ఇక కెప్టెన్ గా తను ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది.కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా గిల్ టీం ని ముందుండి నడిపిస్తే బాగుంటుందంటూ పలువురు సీనియర్లు కూడా గిల్ కి సలహాలను ఇస్తున్నారు.మరి ఈసారి గుజరాత్ టీమ్ కి టైటిల్ ని అందిస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.

ఇక గత రెండు సీజన్లలో బ్యాటింగ్ లోను, బౌలింగ్ లోను రాణించిన ఈ టీమ్ ఇప్పుడు కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ ని కొనసాగించాలని చూస్తున్నారు.ఇక ఏది ఏమైనా ఈ టీం భారం మొత్తం గిల్ మీదనే ఉంది కాబట్టి ఆయన ఎక్కడ తడబడకుండా టీమ్ ను ముందుకు తీసుకెళ్తేనే టీం యొక్క పరువు అయితే నిలబడుతుంది.లేకపోతే మాత్రం అటు గిల్ కి, ఇటు యాజమాన్యానికి తీవ్రమైన విమర్శలు అయితే రాక తప్పవు…
.






