తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.ఆయన ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడమే కాకుండా భారీ సక్సెస్ లను కూడా అందుకున్నాడు.
అందుకే చిరంజీవి( Chiranjeevi ) అంటే అప్పట్లో ప్రతి ప్రేక్షకుడికి విపరీతమైన అభిమానం ఉండేది.ఆయన సినిమాలు చూస్తూ చాలామంది ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని వివిధ రంగాల్లో కూడా రాణించినవారు ఉన్నారు.

చిరంజీవి లాంటి స్టార్ హీరోకి సూపర్ సక్సెస్ ని అందించిన ఒక దర్శకుడు మోహన్ బాబుకి( Mohan Babu ) మాత్రం డిజాస్టర్ ని అందించాడు దానికి కారణం ఏంటి అంటూ సోషల్ మీడియా వేదికగా గత రెండు రోజుల నుంచి ఇదే చర్చ జరుగుతుంది.అయితే ఆ డైరెక్టర్ ఎవరు అంటే చిరంజీవితో మాస్టర్ సినిమా ( Master movie )తీసి అదిరిపోయే సక్సెస్ ని అందించిన సురేష్ కృష్ణ( Suresh Krishna ).ఆయన చేసిన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.ఇక మొత్తానికైతే చిరంజీవికి మాస్టర్ రూపంలో ఒక సూపర్ హిట్ ను అందించాడు.
అలాగే డాడీ సినిమాతో అవరెజ్ సినిమాని అందించాడు.కానీ మోహన్ బాబు కి మాత్రం రాయలసీమ రామన్న చౌదరి( Rayalaseema Ramanna Chaudhary ) సినిమాతో భారీ డిజాస్టర్ ని అందించాడు.
అయితే ఈ సినిమాలో మోహన్ బాబు చూపించిన ఆటిట్యూడ్ కానీ యాక్టింగ్ గాని నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి.

కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది.ఎందుకంటే ఈ సినిమాలో చాలా అనవసరమైన ఎలిమెంట్స్ కూడా ఉంటాయి.వాటిని కనక దర్శకుడు ముందే గుర్తించగలిగితే ఈ సినిమా రిజల్ట్ వేరేలా ఉండేదని మరి కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు…ఇక ప్రస్తుతం మోహన్ బాబు మంచి క్యారెక్టర్స్ దొరికితే ఇతర హీరో లా సినిమాలో కూడా నటించడానికి సిద్దం అవుతున్నాడు.








