Anchor Suma : ఉమెన్స్ డే స్పెషల్ అలాంటి వీడియోని షేర్ చేసిన సుమ.. భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్?

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో యాంకర్ సుమ కనకాల( Suma Kanakala ) ఒకరు.ఈమె ఒకప్పుడు బుల్లితెరపై వరుస కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉండేవారు అయితే ఇటీవల కాలంలో బుల్లితెర కార్యక్రమాలను కాస్త తగ్గించారని చెప్పాలి.

 Anchor Suma Womens Day Special Video-TeluguStop.com

  ఇలా బుల్లితెర కార్యక్రమాలు తగ్గించినప్పటికీ ఈమె సినిమా ఈవెంట్లు ప్రమోషన్లు అంటూ పెద్ద ఎత్తున బిజీగా గడుపుతున్నారు.

ఒక సినిమా విడుదల అవుతుంది అంటే టీజర్ లాంచ్ నుంచి మొదలుకొని ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ , థాంక్స్ మీట్, సక్సెస్ ఈవెంట్ అంటూ సినిమా ఈవెంట్లకు వరుసగా యాంకరింగ్ చేయడమే కాకుండా సినిమా ప్రమోషన్లలో( Movie Promotions ) భాగంగా సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ కూడా ఈమె ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇలా రోజుకు 24 గంటలు ఏమాత్రం తీరిక లేకుండా కష్టపడుతూ ఉన్నటువంటి సుమ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

ఇలా సోషల్ మీడియా వేదికగా సుమా షేర్ చేసే వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంటాయి.ఈమె వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి.కొన్నిసార్లు షూటింగ్ లొకేషన్లో తన టీం తో కలిసి ఈమె చేసే హంగామా మామూలుగా ఉండదు.

ఇక ఇంట్లో కూడా తన స్టాఫ్ అందరితో కలిసి ఈమె వీడియోలు తీస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.ఇకపోతే మహిళా దినోత్సవం( Womens Day ) సందర్భంగా సుమ తన ఇంట్లో చేసే పనులన్నింటిని ఒక వీడియో రూపంలో చిత్రీకరించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఉదయం లేచిన నుంచి మొదలుకొని ఇంట్లో వంట పని ఇంటి పని అలాగే షూటింగ్ కు వెళ్లడం ఇలా అన్నింటిని ఒక వీడియో రూపంలో చిత్రీకరించి ప్రతిరోజు మహిళలు ఇంట్లో ఇంతలా కష్టపడతారు అంటూ వారి కష్టాన్ని వీడియో రూపంలో చూపించారు.ఇక ఈమె షేర్ చేసినటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ భారీగా ట్రోల్ చేస్తున్నారు.ఉదయం నుంచి రాత్రి దాకా ఓకే డ్రస్సులో సుమక్క ఇన్ని పనులు చేస్తుందా అంటూ

కొందరు కామెంట్లు చేయగా మరికొందరు సుమ ఇంట్లో కన్నా షూటింగ్ లొకేషన్లోనే ఎక్కువగా ఉంటుంది.మరి ఇదంతా వీడియో కోసమే కదా అంటూ కామెంట్ చేస్తున్నారు.మరికొందరైతే నీ ముందు మహా నటీమణులు కూడా తేలిపోతారు ఆస్కార్ లెవెల్ లో పెర్ఫార్మ్ చేస్తున్నావ్ కదా అక్క అంటూ ఈ వీడియో పై చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube