తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్( Shanthi Swaroop ) గురించి ప్రత్యేకంగా పనిచేయమక్కర్లేదు.చాలామంది శాంతి అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ స్వరూప్ అంటే చాలు ఇట్టే గుర్తు పట్టేస్తారు.
జబర్దస్త్ ద్వారా ఆ రేంజ్ లో పాపులారిటీని సంపాదించుకున్నాడు శాంతి స్వరూప్.అమ్మాయిలు సైతం కుళ్ళకునే విధంగా అందంగా రెడీ అవుతూ తనదైన కామెడీతో ప్రేక్షకులను కడపుబ్బా నవ్విస్తూ ఉంటాడు.
న కామెడీతో అందరినీ నవ్వించిన జబర్దస్త్ శాంతి.తన జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నారు.
గతంలో తన తల్లికి సర్జరీ కోసం ఇంటిని అమ్మేయాల్సి వచ్చిందని తెలిపారు.అమ్మ ఆస్పత్రి ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడంతో తన ఇంటిని అమ్మకానికి పెట్టినట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.అయితే తాజాగా శాంతి తన మదర్‌కు మోకాలి సర్జరీ చేయించినట్లు వెల్లడించారు.తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ విషయాన్ని పోస్ట్ చేశారు.నెల్లూరు( Nellore )లోని అపోలో ఆస్పత్రి( Apollo Hospital )లో అమ్మకు మోకాలి సర్జరీ విజయవంతంగా పూర్తైనట్లు శాంతి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకున్నారు.డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది తమను బాగా చూసుకున్నారని తెలిపారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ప్రస్తుతం మా అమ్మ ఆరోగ్యంతో ఉన్నారని శాంతి ఆనందం వ్యక్తం చేసింది.గతంలో అమ్మకు తెలియకుండానే సర్జరీ కోసం ఇంటిని అమ్మేస్తున్నట్లు చెబుతూ ఎమోషనల్ అయ్యారు.అమ్మకు హెల్త్ బాగాలేకపోవడంతో నేను ఇంటిని అమ్మేస్తున్నానంటూ కన్నీరు పెట్టుకున్నారు.ఈ ప్రకృతిలో అమ్మకు మించిన ఆస్తి, సంపద ఏది ఉండదని అన్నారు.నా ఇంట్లోకి ఎవరు వచ్చినా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని శాంతి తెలిపింది.