సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్( Rajinikanth ) లాంటి హీరోని మనం మరొకరిని చూడలేము ఎందుకంటే ఆయన సినిమా మీద పెట్టిన ఫోకస్ గానీ ఆయన చేసిన శ్రమ గానీ మరెవరు చేయలేరు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఎందుకంటే ఆయన సినిమా విషయం మొదటి నుంచి చివరి వరకు చాలా జాగ్రత్తలు తీసుకొని మరి సినిమాను చేస్తూ ఉంటాడు.
ఇక ఇలాంటి క్రమం లో తమిళంలో సూపర్ హిట్ అయిన ఒక సినిమాని తెలుగులో రజనీకాంత్ ను హీరోగా పెట్టి చేయాలని కొంతమంది ప్రొడ్యూసర్లు ఇంట్రెస్ట్ చూపించినప్పటికీ రజనీకాంత్ మాత్రమే ఆ సినిమాల మీద పెద్దగా ఆసక్తిని చూపించలేదు.
అది ఏ సినిమా అంటే తమిళంలో విజయ్ కాంత్( Vijayakanth ) హీరోగా మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన రమణ సినిమాను తెలుగులో రజనీకాంత్ తో రీమేక్ చేయాలని తమిళ్ ప్రొడ్యూసర్స్ కొంతమంది అనుకున్నారు కానీ దానికి రజనీకాంత్ ఒప్పుకోలేదు.ఇక దాంతో తెలుగులో చిరంజీవి హీరోగా వినాయక్ డైరెక్షన్ లో ఠాగూర్( Tagore ) అనే సినిమా చేసి సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా చిరంజీవి కెరీయర్ లోనే ఒక బెస్ట్ సినిమాగా నిలిచిపోయింది.ఇక నిజానికి రజనీకాంత్ ఈ సినిమా చేసిన కూడా ఆయనకి తెలుగులో మంచి ఆదరణ లభించేది.
ఎందుకంటే రజనీకాంత్ నిజ జీవితపు క్యారెక్టర్ కి సిమిలర్ గా ఈ క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి ఆయనని ప్రేక్షకులు విపరీతంగా అభిమానిస్తూ ఉంటారు.దానివల్ల ఈ సినిమా రజినీకాంత్ తో చేసిన సూపర్ సక్సెస్ అయ్యేది…ఎందుకంటే ఈ సినిమాలో హీరో చేసే పోరాటం జనం కోసం ఉంటుంది కాబట్టి అది చిరంజీవి రజినీకాంత్ లాంటి స్టార్ హీరోల్లో ఎవరు చేసిన జనాలకి ఈజీగా కనెక్ట్ అవుతుంది…
.