ప్రజల్ని దోచుకునేందుకేనా ఎల్‌ఆర్‌ఎస్‌:మాజీ ఎమ్మెల్యే బొల్లం

సూర్యాపేట జిల్లా:ఎల్‌ఆర్‌ఎస్‌( LRS ) కోసం దరఖాస్తు చేసుకున్న 25.44 లక్షల మంది దరఖాస్తుదారులపై కనీసం లక్ష రూపాయల చొప్పున మొత్తం రూ.20వేల కోట్ల వరకు భారాన్ని మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) సిద్ధమైందని కోదాడ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్ ( Bollam Mallaiah Yadav ) విమర్శించారు.బుధవారం కోదాడ నియోజకవర్గ కేంద్రంలో ఎలాంటి చార్జీలు లేకుండా ఎల్‌ఆర్‌ఎస్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ నయా నగర్ పార్టీ కార్యాలయం నుండి ఖమ్మం ఎక్స్ రోడ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహిస్తూ ఎక్స్ ఖమ్మం రోడ్లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.

 Lrs To Rob People: Former Mla Bollam,lrs ,congress Govt , Brs, Bollam Mallaia-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌ఆర్‌ఎస్‌ పేరిట 25 లక్షల మంది దరఖాస్తుదారుల నుంచి రూ.20 వేల కోట్ల వరకు వారి రక్త మాంసాలను పీల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు.ఎల్‌ఆర్‌ఎస్‌ను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉచితంగా అమలు చేస్తామంటూ హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే ప్రజలను పీడిస్తున్నారని మండిపడ్డారు.కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా మ్యానిఫెస్టోలో 420 హామీలు,6 గ్యారెంటీలను ఇచ్చారని,కానీ,బీఆర్‌ఎస్‌( BRS ) అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలనే కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు.

ప్రజల నుంచి ఎలాంటి చార్జీలు లేకుండా ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా ప్లాట్ల రెగ్యులరైజేషన్‌ చేయాలని గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని డిమాండ్‌ చేశారు.గత ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ క్రమబద్ధీకరణ కోసం మార్గదర్శకాలు రూపొందించినప్పుడు, ఇదే కాంగ్రెస్‌ నేతలు అడ్డగోలుగా మాట్లాడినారని,ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీ మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌ కార్యక్రమంలో ఎలాంటి చార్జీలు వసూలు చేయబోమని ప్రకటించాలని,లేకుంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు‌,ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజా ప్రతినిధులు,బీఆర్ఎస్ పార్టీ అన్ని విభాగాల నాయకులు,ఎల్ఆర్ఎస్ బాధితులు,కార్యకర్తలు, పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube