ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ నుంచి విడా పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్లు( Electric scooters ) మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. విడా వి1 ప్లస్( Vida V1 Plus ) ఎక్స్ షోరూం ధర రూ 1.15 లక్షలు.వి1 ప్రో తో పోలిస్తే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ 30 వేలు తక్కువకు లభిస్తోంది.

భారతదేశం లోని రోడ్లపై తిరిగే బజాజ్, టీవీఎస్, ఏథర్, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల( Ola electric scooters )కు ఈ విడా వి1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ గట్టి పోటీ ఇవ్వనుంది.ప్రస్తుతం మార్కెట్లో ఓలా ఎస్1 ఎయిర్, టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ అర్బన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తోంది.తాజాగా విడుదలైన విడా వి1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ గట్టి పోటీ ఇవ్వనుంది.ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ఫీచర్ల విషయానికి వస్తే.విడా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్.3.4kWh బ్యాటరీ ప్యాక్, 100 కిలోమీటర్ల రేంజ్, ఐదు గంటల్లో సున్నా నుంచి 80% చార్జింగ్ అవుతుంది.

టీవీఎస్ ఐక్యూబ్( TVS iQube ).3kWh బ్యాటరీ ప్యాక్, 100 కిలోమీటర్ల రేంజ్, 4.3 గంటల్లో సున్నా నుంచి 80% చార్జింగ్ అవుతుంది.ఈ స్కూటర్ ఎక్స్ షోరూం ధర రూ.117422 గా ఉంది.ఓలా S1 ఎయిర్.3kWh బ్యాటరీ ప్యాక్, 151 కిలోమీటర్ల రేంజ్, ఐదు గంటల్లో సున్నా నుంచి 80% చార్జింగ్ అవుతుంది.ఈ స్కూటర్ ఎక్స్ షోరూం ధర రూ.104999 గా ఉంది.బజాజ్ చేతక్ అర్బనే.2.9kWh బ్యాటరీ ప్యాక్, 113 కిలోమీటర్ల రేంజ్, 4.5 గంటల్లో సున్నా నుంచి 80% చార్జింగ్ అవుతుంది.ఈ స్కూటర్ ఎక్స్ షోరూం ధర రూ.115001 గా ఉంది.హీరో మోటోకార్ప్ కొత్త ఎలక్ట్రికల్ స్కూటర్ సింగిల్ చార్జ్ తో 100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 5:15 గంటల సమయం పడుతుంది.ఈ స్కూటర్ మధ్యతరగతి ప్రజల బడ్జెట్లోనే అందుబాటులో ఉంది.







