ప్రస్తుత కాలంలో వివాహాలు, శుభకార్యాలు కొందరు వారి స్థాయికి తగ్గట్టుగా చేస్తుంటే.మరికొందరు వారి స్థాయిని మించి చేస్తుండడం మనం గమనిస్తూనే ఉంటాం.
చిన్న కార్యక్రమాల నుండి పెళ్లి తంతవరకు అనేక రకాల ఏర్పాట్లను చేసుకుంటూ కార్యక్రమాలని పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు.తాజాగా ఉత్తర ప్రదేశ్( Uttar Pradesh ) లో జరిగిన సంఘటన ప్రస్తుతం చర్చనీయా అంశంగా మారింది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతాప్ గడ్ ( Pratap Gad )జిల్లాలోని ఉపాధ్యాయ పూర్ గ్రామానికి చెందిన కృపాశంకర్ తివారి ( Kripashankar Tiwari )తన కుమార్తె వివాహాన్ని ఘనంగా నిర్వహించాడు.ఆ వివాహం జరిగిన తర్వాత తన కుమార్తెకు ఏకంగా హెలికాప్టర్ తో వీడ్కోలు తెలిపాడు.పెళ్లి అనంతరం సుల్తాన్ పూర్ లోని శంకర్ గౌడ్ ప్రాంతానికి చెందిన సతీష్ పాండే ( Satish Pandey )తో తన కూతురిని అత్తారింటికి హెలికాప్టర్ లో పంపించాడు.
ప్రతాప్ గౌడ్ నగరంలోని రాణి రామ్ గార్డెన్ లో జరిగిన వివాహ వేడుక సందర్భముగా ఈ సంఘటన చోటుచేసుకుంది.

వివాహ అనంతరం జరిగిన ఈ సంఘటనతో హెలికాప్టర్ లో వధూవరులు కూర్చున్న తర్వాత వారిని చూసేందుకు అక్కడికి భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు.ఇక కృపా శంకర్ విషయానికొస్తే.ఆయన ముంబై నుండి వెలువడి ‘అభ్యుదయ వాత్సల్యం’ అనే పత్రికకు చీప్ ఎడిటర్ గా పనిచేస్తున్నాడు.
అలాగే ఆయన కుమారుడు కూడా ఓ కార్పొరేట్ ప్రైవేట్ లిమిటెడ్ మీడియాకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ గా కొనసాగుతున్నారు.ఏది ఏమైనా చేదులో డబ్బులు ఉంటే ఇలాంటి వేడుకలైన పెద్ద ఎత్తున చేస్తున్నారు.







