తాజాగా వెలువబడిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ( World Test Championship )పాయింట్ పట్టికలో భాగంగా టీమిండియా మొదటి ప్లేస్ కు దూసుకోవచ్చింది.కొత్త కాలంగా ఈ పాయింట్ల పట్టికలో ముందంజలో ఉన్న న్యూజిలాండ్( New Zealand ) కాస్త ఓటమితో పాయింట్లు కోల్పోవడంతో టీమ్ ఇండియా అగ్ర స్థానానికి చేరుకుంది.
దీనికి కారణం తాజాగా న్యూజిలాండ్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడమే.

మరోవైపు ఇంగ్లాండ్, భారత్ టూర్ లో భాగంగా జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా జరిగిన నాలుగు టెస్టుల్లో భారత్ మూడు టెస్టులలో విజయం సాధించగా.హైదరాబాదులో జరిగిన మొదటి టెస్ట్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే.ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్,ఇండియా( England, India ) టెస్ట్ సిరీస్ 3 – 1తో భారత్ ఆదిత్యంలో కొనసాగుతుంది.

తాజాగా వెలువడిన పాయింట్లు పట్టిక నేపథ్యంలో భారత్ 64.58 పాయింట్స్ పర్సంటేజ్ తో మొదటి స్థానంలో నిలిచింది.ఆ తర్వాత న్యూజిలాండ్ ఓటమిపాలు కావడంతో 60 పిటిసి తో రెండో స్థానంలో కొనసాగుతుంది.న్యూజిలాండ్ ఈ టెస్ట్ మ్యాచ్ కు ముందు 75 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా ఓటమితో తన స్తానాన్ని దిగజార్చుకుంది.ఇక ఈ లిస్టులో ఆస్ట్రేలియా 59.09 పాయింట్లతో తర్వాత స్థానంలో కొనసాగుతుంది.మార్చి ఏడో తారీఖున భారత్ ఇంగ్లాండ్ మధ్య నామమాత్రపు 5వ టెస్టు ధర్మశాలలో జరగనుంది.ఇక బ్యాటర్స్ ర్యాగింగ్ విషయానికొస్తే టాప్ 10 లో కేవలం విరాట్ కోహ్లీ మాత్రమే 9వ స్థానంలో కొనసాగుతున్నాడు.
ఆ తర్వాత యశస్వి జైస్వాల్ 12 స్థానంలో ఉండగా.రోహిత్ శర్మ 13 స్థానంలో, రిషబ్ పంత్ 14వ స్థానంలో ఉన్నారు.ఇక టెస్టు బౌలింగ్ విషయం చూస్తే మొదటి రెండు స్థానాల్లో భారత ప్లేయర్లు కొనసాగుతున్నారు.జస్ప్రిత్ బూమ్రా 867 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా.846 పాయింట్లతో రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో కొనసాగుతున్నారు.అలాగే రవీంద్ర జడేజా 785 ఆ పాయింట్స్ తో టాప్ 10 లో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.







