తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ డైరెక్టర్లు తమ కంటు ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడానికి కొన్ని సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధిస్తారు.ఇక ఆ తర్వాత మరికొంత మెరుగైన కథలతో వచ్చి స్టార్ హీరోలతో కలెక్షన్స్ కొల్లగొట్టే ప్రయత్నం చేస్తారు.
ఇక ఇదే రూట్ లో ఇండస్ట్రీ కి వచ్చిన డైరెక్టర్ బాబీ( Director Bobby ) .ఇక ఈయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.ఎందుకంటే బాబీ రవితేజతో( Ravi Teja ) చేసిన పవర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.
ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో రెండో సినిమాకే ఏకంగా పవన్ కళ్యాణ్ ని డైరెక్షన్ చేసే స్థాయికి ఎదిగాడు.ఇక అందులో భాగంగానే బాబీ డైరెక్టర్ గా పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత ఆయన ఎన్టీఆర్ ని హీరోగా పెట్టి జై లవకుశ ( Jai Lavakusa )అనే సినిమా చేశాడు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు క్యారెక్టర్స్ లో నటించి ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ను అయితే సంపాదించుకున్నాడు.
ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా అటు ఎన్టీఆర్( NTR ) కి, ఇటు బాబీ కి మంచి గుర్తింపును తీసుకొచ్చింది.ఇక ఇదిలా ఉంటే మొదట బాబీ ఈ సినిమా స్టోరీని రవితేజ కోసం రాసుకున్నాడట.ఆయనతో చేయాల్సింది కానీ కొన వెంకట్ ఈ కథను ఎన్టీఆర్ కి వినిపించాడట.
దాంతో ఎన్టీఆర్ ఈ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.ఇలా ఈ సినిమా రవితేజ దగ్గర నుంచి ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి పోయింది.
మొత్తానికైతే బాబీ ఈ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకొని మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడనే చెప్పాలి…