Car Kitchen : కారును కిచెన్‌గా మార్చేసిన దంపతులు.. వీడియో వైరల్..

నేటి బిజీ వరల్డ్‌లో చాలా మంది ఖాళీ దొరికినప్పుడల్లా టూర్లకు వెళ్లి ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవుతున్నారు.కొంతమందేమో రెగ్యులర్‌గా టూర్లకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు.

 The Couple Who Converted The Car Into A Kitchen The Video Is Viral-TeluguStop.com

ఫ్యామిలీస్, ఫ్రెండ్స్‌తో తరచుగా టూర్లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు.కానీ కొందరికి జర్నీలలో బయట ఫుడ్ అస్సలు పడదు.

దాంతో హెల్త్ ప్రాబ్లమ్స్( Health problems) వస్తాయేమోనని టూర్లకు వెళ్లడమే మానేస్తుంటారు.మరికొందరేమో వారికి కావలసిన ఫుడ్ ని ఇంటిదగ్గర ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తుంటారు.

అవి తప్ప మరే ఫుడ్ ఐటమ్స్ లను కొనరు, అస్సలు ముట్టుకోరు.ఈమధ్య కొంతమంది కార్లలో టిఫిన్ సెంటర్స్ ని పెట్టి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లి టిఫిన్స్ అమ్మడం సోషల్ మీడియా( Social media)లో మనం చూస్తూనే ఉంటాం.నెటిజనులు కూడా అలా వెరైటీ గా ఉన్న వీడియో లను చూడడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.ఇలాంటి ఘటనకు సంబందించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ వీడియో గురించి మనం కూడా తెలుసుకుందాం.

వైరల్ అవుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్( Instagram ) హ్యాండిల్ (@ghumakkad_bugz) షేర్ చేసారు.ఆ వీడియోలో ‘చిక్క, కపిల్‘ అనే దంపతులు తమ కారుని కిచెన్ గా మార్చేశారు.అంతే కాకుండా వంటలకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువును కారులో అమర్చుకున్నారు.

సిలిండర్, డబ్బాలు, చివరకు బెడ్ కూడా కారులో పట్టేటట్లు ఏర్పాట్లు చేసుకున్నారు.వారిద్దరూ ఎక్కడికి వెళ్లిన స్వయంగా తమ చేతితో వంట చేసుకుని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీన్ని చూసిన నెటిజన్లు ‘వావ్! సూపర్ ఐడియా, భలే ఉందిగా మీ ట్యాలెంట్’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

 ఈ వీడియోను మీరూ చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube