ఇటీవల కాలంలో చాలా మంది మేకప్ కి బాగా అలవాటు పడిపోయారు.మేకప్ లేకపోతే బయట కాలు పెట్టడానికి కూడా ఇష్టపడడం లేదు.
కానీ కొందరు మాత్రం మేకప్ లేకపోయినా చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు.అలాంటి వారిని చూస్తే కాస్త ఈర్ష కలగడం సర్వసాధారణం.
మరి మేకప్ లేకపోయినా మెరిసి పోవాలని మీరు కోరుకుంటున్నారా.అయితే ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ ఫేస్ వాష్( Natural Face Wash ) మీకు చాలా బాగా సహాయపడుతుంది.
ఈ ఫేస్ వాష్‌ను రెగ్యులర్ గా వాడారంటే మేకప్ లేకపోయినా సరే అందంగా ఆకర్షణీయంగా మెరిసిపోతారు.అదే సమయంలో మరెన్నో స్కిన్ కేర్ బెనిఫిట్స్( Skin Care ) మీ సొంతం అవుతాయి.
ఇంతకీ ఆ న్యాచురల్ ఫేస్ వాష్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి( Multani Mitti ), వన్ టేబుల్ స్పూన్ రోజ్ పెటల్స్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ బీట్ రూట్ పౌడర్( Beetroot Powder ), వన్ టేబుల్ స్పూన్ నీమ్ పౌడర్ మరియు హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా మన ఫేస్ వాష్ పౌడర్ సిద్ధం అవుతుంది.
ఈ పౌడర్ చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.రోజు హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున ఈ పౌడర్ ను తీసుకుని వాటర్ యాడ్ చేసి ఫేస్ వాష్ కు ఉపయోగించాలి.
నిత్యం ఇలా న్యాచురల్ గా ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల చర్మం లోతుగా శుభ్రం అవుతుంది.స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది.
చర్మంపై అధిక ఆయిల్ ఉత్పత్తి తగ్గుతుంది.

వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. టాన్ రిమూవ్( Tan Remove ) అవుతుంది.చర్మ ఛాయ మెరుగుపడుతుంది.
అంతేకాదు ముదురు రంగు మచ్చలు ఏమైనా ఉంటే తగ్గు ముఖం పడతాయి.స్కిన్ సూపర్ గ్లోయింగ్ గా మరియు షైనీ గా( Skin Glowing ) మారుతుంది.
ఈ న్యాచురల్ ఫేస్ వాష్ ను రెగ్యులర్‌గా వాడారంటే మేకప్ లేకపోయినా సరే అందంగా ఆకర్షణీయంగా మెరిసిపోతారు.కాబట్టి తప్పక ట్రై చేయండి.







