తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న చిరంజీవి( Chiranjeevi ) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందుతున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఆయన చేసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ సాధించడం తోపాటుగా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆయనను టచ్ చేసే హీరో మరొకరు లేరు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు చిరంజీవి రిజెక్ట్ చేసిన ఒక సినిమాతో బాలయ్య బాబు ఇండస్ట్రీ హిట్ కొట్టిన విషయం చాలా మందికి తెలియదు.
బాలకృష్ణ హీరోగా బి గోపాల్ డైరెక్షన్ లో వచ్చిన నరసింహనాయుడు సినిమా( Narasimha Naidu ) స్టోరీ ని మొదట చిన్ని కృష్ణ చిరంజీవికి వినిపించాడట.కానీ చిరంజీవి అప్పుడున్న ఇమేజ్ కి ఆ కథ చేయాలా వద్దా అని చాలా రోజులపాటు డైలమాలో ఉండి ఫైనల్ గా ఆ కథకి నో చెప్పాడట… దాంతో చిన్ని కృష్ణ ఈ కథను బి.గోపాల్ కి చెప్పగా, ఆయన ఆ స్టోరీ ని బాలయ్య బాబు( Balakrishna ) దగ్గరికి తీసుకెళ్లి స్క్రిప్ట్ ని ఓకే చేశాడు.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో బాలయ్య సూపర్ హిట్ అందుకున్నారనే చెప్పాలి.ఇక బాలయ్య సమరసింహారెడ్డి తర్వాత నరసింహనాయుడు సినిమాతో వరుసగా బి గోపాల్( Director B Gopal ) డైరెక్షన్ లో రెండు ఇండస్ట్రీ హిట్లు కొట్టాడు…ఇక దీంతో బాలయ్య పేరు ఇండస్ట్రీలో మాడుమోగి పోయిందనే చెప్పాలి.
ఇక ఆ తర్వాత చిరంజీవి మళ్ళీ బి గోపాల్ డైరెక్షన్ లో ఇంద్ర( Indra ) అనే సినిమా చేసిన విషయం మనకు తెలిసిందే…అది కూడా చిరంజీవి చాలా దగ్గరుండి మరి మార్పులు చేర్పులు చేసుకొని ఆ సినిమాని చేశారట…ఇక మొత్తానికేతే చిరంజీవి ఈ సినిమా తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు…
.