తెలంగాణ( Telangana )లో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా నలుగురు నిందితులను రెండో రోజు కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు వారిని విచారిస్తున్నారు.
రూ.2 కోట్ల నిధుల దారి మళ్లింపుపై ఏసీబీ( ACB ) ఆరా తీస్తుంది.అలాగే కుంభకోణం( Sheep Distribution Scam )లో అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరనే దానిపై కూడా అధికారులు వివరాలు సేకరిస్తున్నారని సమాచారం.నిన్న సుదీర్ఘంగా ఆరు గంటలపాటు నిందితులను అధికారులు విచారించారు.
ఈ క్రమంలోనే వారి నుంచి కీలక సమాచారం రాబట్టారని తెలుస్తోంది.