సినిమా ఇండస్ట్రీలో కొందరు మాత్రమే ఏ తరహా పాత్రనైనా పోషించి ఆ పాత్రకి న్యాయం చేయగలుగుతారు.ఇక అది ఎలాంటి పాత్ర అయిన సరే ఒక్కసారి ఆ నటులు చేశారు అంటే ఇక ఆ పాత్రలో ఎవరు చేసిన వాళ్ళని రీప్లేస్ చేయలేరు అనేంతలా జనాల్ని మైమరిపించే నటులు ఇండస్ట్రీలో కొంతమంది మాత్రమే ఉన్నారు.
వాళ్లలో మొదటగా చెప్పుకునే పేరు ప్రకాష్ రాజ్( Prakash Raj )…ఆయన చేసిన ప్రతి పాత్ర సినిమాతో సంబంధం లేకుండా సూపర్ సక్సెస్ అవుతుంది.అందుకే ప్రకాష్ రాజ్ ను తమ సినిమాల్లో పెట్టుకోడానికి ప్రతి దర్శక నిర్మాతలు( Director Producers ) పోటీ పడుతూ ఉంటారు.
ఒకానొక సమయంలో ఆయన పైన బ్యాన్ విధించిన కూడా అ బ్యాన్ ను ఎత్తివేసి మరి ప్రకాష్ రాజ్ ని ఆ క్యారెక్టర్ లో నటింపజేశారు అంటే ఆయన కెపాసిటీ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.

ఇక ప్రస్తుతం ఆయన చేయగలిగే పాత్రలను రీప్లేస్ చేసే నటులు ఇండస్ట్రీలో లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక రావు రమేష్ లాంటి నటులు ప్రకాష్ రాజ్ ను రీప్లేస్ చేస్తారు అని అనుకున్నప్పటికీ ఆయనతో కూడా అవలేదు.మళ్లీ ప్రకాష్ రాజ్ తన తరహ పాత్రలని పోషిస్తూ వస్తున్నాడు.
ఇక ఇప్పటికీ కూడా ప్రకాష్ రాజ్ కి పోటీ ఇచ్చే నటులు అయితే ఇండస్ట్రీలో కనిపించడం లేదు.ఇక ముందు ముందు ఎవరైనా వస్తే తప్ప ఆయన ప్లేస్ ని మాత్రం రీప్లేస్ చేసే నటులు ఇండస్ట్రీకి దొరకడం లేదు.

ఇక ఇప్పటికే ఆయన అన్ని రకాల పాత్రలు పోషించి ఉన్నారు కాబట్టి ఇక కొత్తగా ఆయన చేసే పాత్ర కూడా ఏది లేదు…అందుకే మనం ఏదైనా ఒక సినిమా చూస్తున్నప్పుడు పాలనా పాత్రలో ఈ నటుడు కంటే ప్రకాస్ రాజ్ చేస్తే సూపర్ గా ఉండేది అని అనుకునే స్థాయి కి వచ్చాము అంటే ప్రకాష్ రాజ్ జనాల్లో ఎంత ఇంపాక్ట్ ను క్రియేట్ చేశాడో అర్థం చేసుకోవచ్చు…
.








