సినిమా ఇండస్ట్రీలో ఒక సక్సెస్ రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది.ఇప్పుడు సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు ఒకప్పుడు చాలా కష్టాలు పడి, కన్నీళ్లను దిగ మింగి, తిని తినక చాలా రోజులు పాటు పస్తులుండి, ఆకలితో అలమటించిన వాళ్లే కావడం విశేషం.
ఇక అప్పట్లో కష్టాలు పడిన ప్రతి ఒక్కరు అన్ని రోజులు కష్టాలే ఉండవు కదా అనే ఒక మాటను గట్టిగా నమ్ముకొని ముందుకు కదులుతారు.కానీ ఫైనల్ గా ఏదో ఒకరోజు వాళ్ళు పడిన కష్టానికి మంచి అవకాశాలు రావడమే కాకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కూడా ఎదుగుతారు.
ఇక అలాంటి వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఒకరు.ఈయన తీసిన ప్రతి సినిమా సామాన్య జనాలను అలరించే విధంగా ఉంటాయి.
ఆయన సినిమాలు ప్లాప్ అయిన కూడా ఆయనకి మాస్ లో ఉన్న ఫాలోయింగ్ వల్ల ఆ సినిమా బి, సి సెంటర్ లలో మంచి వసూళ్లను రాబడుతుంటాయి.

ఇక ఆయన దాదాపు 40 సంవత్సరాలు నుంచి మెగాస్టార్ గా కొనసాగుతున్నాడు.ఇక 2008 వ సంవత్సరంలో ఆయన ప్రజారాజ్యం( prajarajyam ) అనే పార్టీని పెట్టి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.అయితే ఆ రాజకీయాల్లో తను ఇమడలేక మళ్లీ సినిమాల్లోకి ఖైదీ నెంబర్ 150 తో రీ ఎంట్రీ ఇచ్చి, ప్రస్తుతం సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు.
ఇక ఇది ఇలా ఉంటే కొద్ది రోజుల క్రితం విజయశాంతి( Vijaya Shanthi ) చిరంజీవి మీద చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.అవి ఏంటి అంటే ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రామారావు గారు సీఎం అయ్యారని, అలా వచ్చిన ప్రతి ఒక్కరు సిఎం అవ్వలేరు.
ఎందుకంటే అప్పట్లో రామారావు గారు చాలా కష్టపడ్డారు.ఊరు ఊరుకి తిరిగి ఒక్కొక్కరి ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకున్నారు.

అందువల్లే ఆయనను జనాలు నమ్మి ఆయనకు ఓటేశారు.ఇక ఇప్పుడున్న వాళ్ళు కష్టపడకుండా గెలవాలి అంటే ఎలా గెలుస్తారు అంటూ ఇన్ డైరెక్ట్ గా తను అప్పట్లో చిరంజీవి మీద కామెంట్స్ చేసింది.ఇక దాంతో చిరంజీవి అభిమానులు కూడా విజయశాంతి పైన చాలా కామెంట్లు అయితే చేశారు… ఇక ప్రస్తుతం విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.చిరంజీవి మాత్రం పాలిటిక్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ చాలా బిజీగా గడుపుతున్నారు…
.







