బీజేపీ ఎంపీ బండి సంజయ్( BJP MP Bandi Sanjay )పై కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రాముడి పేరుతో కోట్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
ఐదేళ్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్ చేసిన అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నించారు.మతం పేరిట ప్రజలను రెచ్చగొట్టడం తప్ప బండి సంజయ్ చేసిందేమీ లేదని విమర్శించారు.

ఈ క్రమంలోనే రాముడి పేరుతో గెలవాలనుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని తెలిపారు.అయితే గత కొన్ని రోజులుగా కరీంనగర్ లో బండి సంజయ్, పొన్నం ప్రభాకర్( Ponnam Prabhakar ) మధ్య మాటాల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.







