ఒక సినిమా తీయాలంటే డైరెక్టర్( Director ) కి చాలా రకాల ప్రెషర్స్ అయితే ఉంటాయి.అన్ని డిపార్ట్మెంట్ల మీద ఆయనకి అవగాహన ఉండాలి.
ఒక్కొక్క దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ప్రతి ఒక్క టెక్నీషియన్ దగ్గర నుంచి బెస్ట్ అవుట్ ఫుట్ ని తీసుకుంటు ముందుకు సాగాలి.ఇక దానికి తగ్గట్టుగానే షూటింగ్ స్పాట్ లో ఆర్టిస్టులు నటించేటప్పుడు రెండు మూడు టేకులు ఎక్కువగా తీసుకున్నట్టైతే డైరెక్టర్లకు విపరీతమైన కోపం వస్తుంది.

ఇక అలాంటి కోపంలో కొంతమంది డైరెక్టర్లు తిట్టడం లాంటివి చేస్తుంటారు.కానీ సంచలన దర్శకుడుగా పేరు పొందిన తేజ ( Teja )మాత్రం ఆర్టిస్టులు సరిగ్గా పెర్ఫార్మ్ చేయకపోతే మాత్రం ఆయన సెట్ లోనే అందరి ముందే వారిని కొడతాడు అనే పేరు అయితే సంపాదించుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల్లో దాదాపు పది మందికి పైనే ఆర్టిస్టులను కొట్టి ఉంటాడని ఆయనతో సన్నిహితంగా ఉన్న చాలామంది చెప్తూ ఉంటారు.ముఖ్యంగా చిత్రం, నువ్వు నేను సినిమా( Chitrem , nuvvu nenu movie ) చేసే సమయంలో ఉదయ్ కిరణ్( Uday Kiran ) ని కూడా రెండు మూడు సార్లు కొట్టినట్టుగా చాలా వార్తలైతే వచ్చాయి.

ఇక అందులో భాగంగానే జయం సినిమాలో సుమన్ శెట్టిని, జై సినిమాలో నవదీప్( Navdeep ) ని, లక్ష్మీ కళ్యాణం సినిమాలో కాజల్ ని ఇలా చాలా మందిని కొట్టాడనే వార్తలు అయితే మీడియాలో చాలావరకు స్ప్రెడ్ అయ్యాయి.ఇక డైరెక్ట్ గా తేజ ను కూడా చాలామంది ఈ టాపిక్ గురించి అడిగితే సెట్లో కోపం వచ్చినప్పుడు సహజంగా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని చెప్పడం విశేషం…ఇక దానికి తగ్గట్టుగానే ఒక దర్శకుడు సెట్ లో మొత్తం వర్క్ లోనే మునిగిపోతాడు కాబట్టి అక్కడ కోపానికి లోనవడం గానీ, కొట్టడం గానీ నార్మల్ గా జరుగుతుంటాయి.ఇక ఆర్టిస్టులు కూడా వాటిని లైట్ తీసుకొని ముందుకు వెళుతూ ఉంటారు…
.







