ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు( AP Elections ) దగ్గర పడే కొలది ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఇంకా ఎన్నికలకు రెండు నెలలు కూడా సమయం లేకపోవడంతో సరికొత్త వ్యూహాలతో పార్టీ అధినేతలు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఈ ఎన్నికలలో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా.జనసేన టీడీపీ( Janasena TDP ) కూటమిగా ఏర్పడ్డాయి.ఈ కూటమిలో బీజేపీ కూడా జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.2024 ఎన్నికలను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu )చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఎట్టి పరిస్థితులలో విజయం సాధించాలని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జాగ్రత్తలు పడుతున్నారు.ఇక ఎన్నికలు దగ్గర పడే కొలది ఒక పార్టీ నుండి మరొక పార్టీకి జంప్ అవుతున్న నాయకుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
తాజాగా జనసేన పార్టీలోకి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు( Former Minister Kothapalli Subbarayudu )… పవన్ కళ్యాణ్ సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది.
కొద్దిరోజుల క్రితమే జనసేన పార్టీ( Janasena )లో జాయిన్ అవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ క్రమంలో సోమవారం జనసేన మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సుబ్బారాయుడికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.2019 ఎన్నికలలో కొత్తపల్లి సుబ్బారాయుడు వైసీపీ( YCP )లో కీలకంగా రాణించారు.అయితే కొన్ని కారణాల వల్ల పార్టీ నుండి సస్పెండ్ కావడం జరిగింది.ఈ క్రమంలో 2024 ఎన్నికలకు సంబంధించి ఉభయగోదావరి జిల్లాలలో జనసేన పార్టీ బలోపేతానికి తనవంతుగా కృషి చేస్తానని ఈ సందర్భంగా సుబ్బారాయుడు వ్యాఖ్యానించడం జరిగింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుబ్బారాయుడు.టీడీపీ హయాంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.ఆ తర్వాత 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయ్యారు.అనంతరం ప్రజారాజ్యం పార్టీని విడిచిపెట్టి వైసీపీలో జాయిన్ అయ్యారు.
కాగా ఇప్పుడు జనసేన పార్టీలో జాయిన్ కావడం జరిగింది.