ఇండస్ట్రీలో చాలామంది హీరోలు చాలా సంవత్సరాల పాటు స్టార్ హీరోలుగా( Star Heroes ) కొనసాగుతూ ఉంటారు.కానీ హీరోయిన్ల కెరియర్ మాత్రం చాలా తక్కువ రోజులే ఉంటుంది.
ఎందుకంటే ఒక సినిమాతో సక్సెస్ వచ్చిందంటే స్టార్ హీరోయిన్ అవుతారు.అదే రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి అంటే పాతాళానికి పడిపోతారు.
ఇక హీరోల పరిస్థితి అలా ఉండదు హీరోయిన్స్ తో పోల్చుకుంటే వాళ్లకు కొన్ని అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి.అవి ఏంటి అంటే ఒక సినిమాతో ఫ్లాప్ వచ్చినా కూడా వాళ్లకు ఉండే మార్కెట్ పెద్ద స్థాయి లో ఉంటుంది.
కాబట్టి మరో సినిమాతో సక్సెస్ కొట్టి వాళ్ళ మార్కెట్ ని వాళ్ళు కాపాడుకుంటారు.
అయితే ప్రస్తుతం ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా ఉన్న ముగ్గురు హీరోలకి ఒక హీరోయిన్ సూపర్ సక్సెస్ లను ఇచ్చిందనే విషయం చాలా మందికి తెలియదు.ఒకరకంగా ఆ ముగ్గురు స్టార్ హీరోలు అవ్వడానికి ఆమెతో చేసిన సినిమాలే ఒక కారణమని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఆ హీరోయిన్ ఎవరు అంటే భూమిక( Bhumika ). 2001 వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా భూమిక హీరోయిన్ గా వచ్చిన ఖుషి సినిమా సూపర్ సక్సెస్ ని అందుకుంది.
ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మొదటిసారి ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమా( Simhadri Movie )లో కూడా భూమికనే హీరోయిన్ గా నటించి ఎన్టీఆర్ కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టు అందించింది.అలాగే మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన ఒక్కడు సినిమా( Okkadu Movie )తో మహేష్ బాబు కి కూడా తన కెరియర్ లోనే అప్పటివరకు లేని ఒక బ్లాక్ బాస్టర్ సక్సెస్ అయితే అందించింది.
ఇలా ముగ్గురు హీరోలను సూపర్ సక్సెస్ లను ఇచ్చి స్టార్ హీరోలను చేయడంలో భూమిక కీలకపాత్ర వహించిందనే చెప్పాలి…