పూరి జగన్నాథ్ కి ( Puri Jagannadh ) కుక్కలు అంటే ఎంత ప్రేమిస్తాడో మనందరికీ తెలిసిందే.ఆయన దగ్గర చాలా కాస్ట్లీ బ్రాండ్ డాగ్స్ ఉన్నాయి.
వాటి మెయింటెనెన్స్ దాదాపు లక్షల్లో ఖర్చు అవుతూ ఉంటుంది.ఆయన సినిమా ఇండస్ట్రీలో( Cinema Industry ) 100 కోట్లకు పైగా డబ్బులు సంపాదించాడు.
అలాగే మొత్తం పోగొట్టుకున్నాడు.డబ్బు ఉన్న టైంలో అన్ని బాగానే ఉంటాయి కానీ పోయిన తర్వాతే ఎవరూ మనతో ఉండరు.
అలాగే తాను ఎంతో ఇష్టం గా పెంచుకున్న కుక్కలను( Dogs ) మైంటైన్ చేయడానికి కూడా చాలా ఖర్చు అవుతుంది.కానీ వాటిపై ఉన్న ప్రేమతో పూరి జగన్నాథ్ ఎంత ఖర్చైనా సరే పెట్టుకుంటూ వచ్చేవాడట.
కానీ ఒకానొక టైం లో వాటి పోషణ భరించలేని ఒక సందర్భం వచ్చిందట.

ఆ సమయంలో వాటిని వేరే తెలిసిన వాళ్లకు ఇచ్చేశాడట.వాటిని చూసుకోవడం తన వల్ల కాకపోవడంతో ఎంత కష్టం వచ్చినా సరే బాధ వచ్చినా సరే తట్టుకోవాలని నిర్ణయించుకొని తన కుక్కలను వేరే వాళ్లకు ఇవ్వాల్సి వచ్చిందట.కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవుగా.
బండ్లు ఓడలవుతాయి ఓడలు బండలు అవుతాయి.అలాగే పూరీ జగన్నాథ్ పడిపోయాడు… మళ్ళీ లేచి నిలబడ్డాడు.
ఇదంతా జరగడానికి ఒక ఐదేళ్ల సమయం పట్టింది.ఆ తర్వాత ఆ తన కుక్కలను ( Puri Jagannadh Pet Dogs ) మళ్ళీ తిరిగి తెచ్చుకున్నాడట.
వాటిని విడిచి ఉండలేకపోయేవాడట పూరి.అందుకే డబ్బు సంపాదించి మళ్లీ అన్ని దగ్గరకైతే తెప్పించుకున్నాడు కానీ వాటి ప్రేమను పొందలేకపోతున్నాడట.

కుక్కలకు విశ్వాసం ఎక్కువ.అవి ప్రేమిస్తాయి …దూరమైతే తట్టుకోలేవు.వాటికి కోపం ఉంటుంది, అలుగుతాయి కూడా.అందుకే నేను ఐదేళ్లపాటు వదిలేసాను అనే కోపంతో నా కుక్కల్లో ఒక కుక్క ఇప్పుడు నాతో మాట్లాడటం లేదు.నేను దగ్గరికి వెళ్లిన అది దూరం వెళ్ళిపోతుంది.కనీసం నన్ను చూస్తే అది తోక కూడా ఊపదు.
నాపై అలిగి దాదాపు మూడు నాలుగు ఏళ్లుగా కలవలేకపోతోంది.అది నేను వదిలేసాను అనే విషయాన్ని మాత్రమే గుర్తు పెట్టుకుంది.
కానీ వాటి కోసం నేను ఎంత కష్టపడి మళ్ళీ డబ్బు సంపాదించి తిరిగి తెచ్చుకున్నానని దానికి తెలియదుగా.పాపం మూగజీవి ప్రేమించడం మాత్రమే కుక్కలకు తెలుసు.
అందుకే వాటి కోసం నేను దారుణంగా ఏడ్చాను.వాటిని వదిలేసిన రోజు ఏడ్చాను అలాగే అది నా దగ్గరికి వచ్చి నాతో కలవలేకపోతున్న టైం లో కూడా ఏడ్చాను.
నా జీవితంలో ఏడ్చిన సందర్భం ఇది మాత్రమే అని పూరి తెలిపారు.







