నాగేశ్వరరావు( Nageswara Rao ) నట వారసుడుగా నాగార్జున ( Nagarjuna ) ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.అయితే మొదట్లో ఆయన చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు.
దాంతో నాగార్జున కెరీయర్ అనేది పూర్తిగా డౌన్ అయిపోతుంది.అని నాగేశ్వర రావు చాలా దిగులుగా ఉండేవాడు.
దాంతో అప్పుడే నాగార్జున రామ్ గోపాల్ వర్మ తో ( Ram Gopal Varma ) ఒక భారీ యాక్షన్ ఫిల్మ్ చేయాలని డిసైడ్ అయ్యాడు.ఇక అందులో భాగంగానే మేకింగ్ కూడా చాలా కొత్తగా ఉండబోతున్నట్టుగా వర్మ నాగార్జునకి చెప్పాడట.
దాంతో నాగార్జున ఆర్జీవిని నమ్మి ఆయనకి ఆ సినిమా చేసే అవకాశాన్ని ఇచ్చాడు.
వర్మ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు కొన్ని సీన్లలో డైలాగ్స్ ను సెట్ లోనే రాస్తూ చేంజెస్ చేస్తూ షూట్ చేసేవారట.ఇక అది చూసిన నాగేశ్వరరావు రామ్ గోపాల్ వర్మ మీద చాలా సీరియస్ అయి ఆయనను సెట్ లోనే అందరి ముందు తిట్టాడట.నమ్మి ఇన్ని డబ్బులు పెడుతున్నప్పుడు ప్రాపర్ గా సీన్ల ను ముందే రాసుకొని పెట్టుకోవాలి కదా సెట్లోకి వచ్చిన తర్వాత ఎందుకు ఈ చేంజ్ చేస్తున్నావ్ అంటూ అందరి ముందే ఆయన అనడంతో వర్మకి ఆయన మాటలు కొంచెం ఇబ్బందిగా అనిపించాయట.
కానీ నాగార్జున మాత్రం అవన్నీ పట్టించుకోకు మనం చేయాల్సిన సినిమాను మనం చేసుకుంటూ ముందుకు వెళ్దామని వర్మతో చెప్పేవాడట.దాంతో వర్మ అవేం పట్టించుకోకుండా సినిమా మీదనే ఎక్కువ ఫోకస్ చేసి సినిమాకి ది బెస్ట్ అవుట్ ఫుట్ వచ్చే విధంగా ప్రయత్నం చేశాడు.ఇక దాంతో ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని రిలీజ్ అయి సూపర్ డూపర్ సక్సెస్ అయింది.ఇక నాగార్జున కెరీర్ లోనే అప్పటివరకు ఉన్న సినిమాల్లో ది బెస్ట్ సినిమాగా గుర్తింపు తెచ్చుకొని మంచి విజయాన్ని అందుకుంది.