యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో శ్రీ రామకృష్ణ మఠం వారి ఆధ్వర్యంలో నిరుపేదలకు వైద్య సేవలు విద్యార్థులకు చదువులపై అవగాహన కార్యక్రమాన్ని శ్రీ సేవా గ్రామ వారి సహకారంతో నిరుపేదలకు,వృద్ధులకు మహిళలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆరవ తరగతి నుండి ఇంటర్ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై మోటివేషన్ క్లాసులు,యోగా శిక్షణా శిబిరాలు నిర్వహించి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఆర్కే మఠం వాలంటరీ వేణు డాక్టర్, జయమ్మ,నగేష, నర్సింగ్,రమేష్,సుభాష్, విగ్నేష్,శివ,శివస్వామి, అరుణ్,రాజు,మధు తదితరులు పాల్గొన్నారు.







