Mahesh Babu : ప్రిన్స్ మహేష్ చేసిన ఎక్స్‌పరిమెంటల్ సినిమాలు ఇవే.. ఎవరూ కూడా చేయలేరు..?

స్టార్ హీరో స్టేటస్ లభించిన తర్వాత చాలామంది నటులు రొటీన్ మూవీలు చేసుకుంటూ వెళ్తారు.మంచి మ్యూజిక్, కామెడీ, ఫైట్లు, సెంటిమెంట్ల వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ తోనే సినిమాలు తీస్తారు.

 Mahesh Babu Experimental Movies Nani Takkari Donga Spyder One Nenokkadine-TeluguStop.com

ప్రయోగాలు చేయడానికి అసలు ఇష్టపడరు.కానీ కొందరు ఉంటారు.

వారు మాత్రం ప్రేక్షకులకు ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ లేదా కథను పరిచయం చేయాలని ప్రయోగాలు చేస్తుంటారు.అలాంటి వారిలో ప్రిన్స్ మహేష్ బాబు( Mahesh Babu ) ముందు వరుసలో ఉంటాడని అనడంలో సందేహం లేదు.

నిజానికి మహేష్ కంటే ముందు సూపర్ స్టార్ కృష్ణ( Superstar Krishna ) ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేవాడు.ఆ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని మహేష్ బాబు కూడా ఎక్స్‌పరిమెంటల్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.

Telugu Mahesh Babu, Nani, Concept, Nenokkadine, Spyder, Takkari Donga, Tollywood

కెరీర్ తొలినాళ్లలోనే జయంత్ సి పరాంజితో కలిసి “టక్కరి దొంగ”( Takkari Donga Movie ) అనే ఒక కౌబాయ్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు.కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ అవ్వదని తెలిసి కూడా రొటీన్ సినిమాలకు భిన్నంగా మహేష్ ఈ మూవీ చేశాడు.ఇందులో మహేష్ యాక్టింగ్ కు అందరూ ఫిదా అయిపోయారు.తర్వాత అతడు చేసిన ప్రయోగాత్మక సినిమా “నాని”.( Nani Movie ) దీనిని తమిళ దర్శకుడు ఎస్ జే సూర్య డైరెక్ట్ చేశాడు.సైంటిఫిక్ ఫిక్షనల్ మూవీగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో హిట్ కాలేదు కానీ ఇప్పుడు టీవీలో వస్తే మాత్రం దీనిని చూడకుండా ప్రేక్షకులు ఉండలేరు.

Telugu Mahesh Babu, Nani, Concept, Nenokkadine, Spyder, Takkari Donga, Tollywood

మహేష్ కెరీర్‌లో ఈ సినిమా కూడా బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది.అయినా ఒక కొత్త కాన్సెప్ట్ చేశామనే సంతృప్తి మాత్రం మహేష్ బాబుకు మిగిలింది.ఈ మూవీలో చిన్న పిల్లాడి లాగా మహేష్ చూపించిన నటన ఆస్కార్ అవార్డు విన్నింగ్ లెవెల్ లో ఉంటుందనడంలో సందేహం లేదు.చిన్నపిల్లాడి లాగా మహేష్ చూపించిన హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేసాయి.

ఇలాంటి పాత్రను ఏ తెలుగు హీరో కూడా పోషించలేదని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

Telugu Mahesh Babu, Nani, Concept, Nenokkadine, Spyder, Takkari Donga, Tollywood

చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ 2014లో సుకుమార్‌తో కలిసి “వన్: నేనొక్కడినే”( One Nenokkadine Movie ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అయితే ఈ మూవీ క్రిటిక్స్ ను మెప్పించింది కానీ కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది.ఇన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా “స్పైడర్” సినిమాతో( Spyder Movie ) మరోసారి ప్రయోగాత్మక సినిమాని తీశాడు.

ఇలా ప్రేక్షకులకు ఏదో ఒక కొత్త సినిమా అందించాలనే తపనతో మహేష్ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube