ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలకు తెలుగుదేశం మరియు జనసేన పార్టీలు పొత్తులు పెట్టుకోవడం జరిగింది.
ఈ రెండు పార్టీలతో కలవడానికి బీజేపీ కూడా రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.దీంతో 2014 ఎన్నికలలో మాదిరిగా “టీడీపీ-జనసేన-బీజేపీ” పార్టీలు కూటమిగా ఏర్పడే పరిస్థితి నెలకొంది.
కాగా శనివారం టీడీపీ- జనసేన కూటమికి సంబంధించి తొలి జాబితాను చంద్రబాబు…పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కలిసి విడుదల చేయడం జరిగింది.తొలి జాబితాలో జనసేన 24 మూడు ఎంపీ స్థానాలలో పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఈ క్రమంలో కాకినాడ జిల్లా జగ్గంపేటకి సంబంధించి టీడీపీ నేత జ్యోతుల నెహ్రూకు( Jyothula Nehru ) దక్కింది.దీంతో మనస్థాపం చెందిన జనసేన నేత పాఠంశెట్టి సూర్య చంద్ర( Patamsetti Suryachandra ) బోరున విలపించారు.టికెట్ ఆశించడం మన తప్పు.మనలాంటి రబ్బరు చెప్పులు వేసుకునే వాళ్ళు ఎమ్మెల్యే టికెట్లు కోరుకోకూడదు.డబ్బులు లేని వాళ్ళం.మనం టికెట్ ఆశించడం పొరపాటు అని అభిమానులు మరియు సన్నిహితులు వద్ద కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది.
తెలుగుదేశం జనసేన కూటమికి సంబంధించి విడుదల చేసిన తొలి జాబితా చాలా చోట్ల అగ్గిరాజేసింది.అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం, పెనుగొండ నియోజకవర్గలలో… టికెట్ రాని ఆశావాహులు.
పార్టీ ఫ్లెక్సీలను కాల్చి నిరసనలు తెలియజేశారు.