సూర్యాపేట జిల్లా: 60 రోజుల్లోనే ఇచ్చిన హామీని అమలు చేసిన హుజూర్ నగర్ ఎమ్మెల్యే,రాష్ట్ర ఇరిగేషన్ అండ్ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి యునైటెడ్ క్రిస్టియన్ మైనారిటీ పాస్టర్స్ వెల్పేర్ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని మంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ హుజూర్ నగర్ పట్టణ క్రైస్తవుల బరియల్ గ్రౌండ్ అభివృద్ధి కొరకు
మాట ఇచ్చిన మంత్రి ఉత్తమ్ 60 రోజుల్లోనే రూ.50 లక్షలు మంజూరు చేయించారని అన్నారు.మాటిస్తే తప్పని నాయకుడు ఉత్తమ్ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ పాస్టర్ జి.డేవిడ్ రాజు, నియోజకవర్గ అధ్యక్షుడు పాస్టర్ టి.సుధాకర్,హుజూర్ నగర్ మండల అధ్యక్షుడు పాస్టర్ గుండు సామ్యూల్, పాస్టర్ ప్రసాద్,పాస్టర్ జాన్ పాల్ తదితరులు పాల్గొన్నారు.