కొన్ని సినిమాలను మనం థియేటర్లో చూసినప్పుడు కొన్ని కొన్ని సీన్లని తీసేస్తే ఆ సినిమా సూపర్ గా ఆడుతుంది అనే అభిప్రాయం ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కలుగుతుంది.అలాగే మరికొన్ని సీన్లని ఆ సినిమాలకి యాడ్ చేస్తే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అనిపిస్తుంది.
ఇలాంటి క్రమంలో కొన్ని సినిమాలను రీ ఎడిట్ చేస్తే ఆ సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ అవుతాయి అని అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.అలాంటి సినిమాలు ఏంటో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం…
బాలు
పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా వచ్చిన బాలు సినిమాలో( Balu Movie ) ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ లో హీరోయిన్ చనిపోతుంది.దాన్ని అప్పుడు ఉన్న ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు.ఒకవేళ ఆ హీరోయిన్ కనక బతికే ఉంటే సినిమా సూపర్ సూపర్ సక్సెస్ అయ్యేది.ఆ సినిమా లో ఆ అమ్మాయి బతికే ఉన్నట్టుగా డిజైన్ చేసి ఇప్పుడు రిలీజ్ చేస్తే మాత్రం సినిమా సూపర్ సక్సెస్ అవుతుందంటూ ప్రేక్షకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
యోగి
ప్రభాస్( Prabhas ) హీరోగా వచ్చిన యోగి సినిమాలో( Yogi Movie ) హీరోయిజం పీక్ స్టేజ్ లో ఉంటుందనే చెప్పాలి.అలాగే మదర్ సెంటిమెంట్ కూడా చాలా బాగా చూపించారు.కానీ క్లైమాక్స్ లో హీరో వాళ్ల అమ్మను చూడకపోవడం అనేది ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ గా మారింది.సినిమా మొత్తం వాళ్ళ అమ్మని హీరో ఎప్పుడు చూస్తాడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు.
ఇక ఇలాంటి సమయంలో వాళ్ళ అమ్మని హీరో చూడలేకపోవడం అనేది ప్రేక్షకుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించింది.దానివల్ల ఈ సినిమా ఫ్లాప్ అయింది.ఒకవేళ ఈ సినిమాను రీ ఎడిట్ చేసి వాళ్ళ అమ్మని కనక తనకి చూపించినట్టుగా సినిమాని డిజైన్ చేస్తే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
.