అప్పుడప్పుడు జంతువులు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం మనం చూస్తూనే ఉంటాం.కొన్నిసార్లు అవి మనుషులను అనుకరిస్తూ ఉంటాయి.
కానీ మనుషులను కాపాడేందుకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టడం చాలా అరుదుగా జరుగుతుంటుంది.అందులోనూ పిల్లులు ఇలాంటి త్యాగానికి పూనుకోవడం ఇంకా అరుదుగా జరుగుతుంటుంది.
ఇలాంటి అరుదైన సంఘటన ఒకటి తాజాగా చోటు చేసుకుంది.ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న వీడియోని మనం గమనించినట్లయితే ఒక పిల్లాడు తమ ఇంటికి ఎదురుగా ఉన్న గోడ పక్కన నిలబడి ఆడుకుంటూ ఉంటాడు.అదే సమయంలో అటుగా ఓ వీధి కుక్క( stray dog ) వస్తుంది.అది ఆ చిన్నారిని చూడగానే దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది.వేగంగా పిల్లవాడి వద్దకు వెళ్లి కరిచే ప్రయత్నం చెయ్యగా బాలుడు భయపడి గట్టిగా ఏడుస్తాడు.ఈ క్రమంలో కింద పడ్డ బాలుడిపై కుక్క దాడి చేయబోతుంది.ఇదంతా దూరం నుంచి గమనించిన పిల్లి( cat ) ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుంటూ వెళ్లి కుక్క మీదకు దూకి దాని కరుస్తుంది.

వెంటనే కుక్క బాలుడిని వదిలిపెట్టి పిల్లి పైకి దూకుతుంది.అంతలో బాలుడి తల్లి అక్కడికి వచ్చి పిల్లాడిని రక్షిస్తుంది.ఇంకోవైపు పిల్లి కుక్కకు దొరక్కుండా అక్కడి నుంచి పారిపోతుంది.దాంతో కుక్క కూడా వెళ్ళిపోతుంది.ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.కుక్క నుంచి బాలుడిని కాపాడిన పిల్లిని నెటిజన్లు బాగా పొగుడుతున్నారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.‘ఈ పిల్లి పిల్లాడి పాలిట దేవుడిలా వచ్చింది’ అని కొందరు అంటుంటే , మరికొందరేమో ‘పిల్లికి ఉన్న మంచి మనసు మనుషుల్లో కరువవుతోంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.







