ఏపీలో జనసేన పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది.తాజాగా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు( Kothapalli Subbarayaudu ) త్వరలో జనసేన పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.
ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరుతున్నానని పేర్కొన్నారు.అలాగే ఏపీ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల కోసం పోరాడుతున్న నేత పవన్ కల్యాణ్ అని కొత్తపల్లి సుబ్బారాయుడు కొనియాడారు.
అయితే ఇటీవలే ఆయన వైజాగ్ లో పవన్ కల్యాణ్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఈ నెలాఖరున పవన్ కల్యాణ్ సమక్షంలో కొత్తపల్లి జనసేన( Janasena ) కండువా కప్పుకోనున్నారని సమాచారం.