ఈ మధ్య కాలంలో అభిమానం హద్దులు దాటుతోంది.స్టార్ హీరోలు కామెంట్ చేస్తేనే తాము పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తామని స్టార్ హీరోలు( Star heroes ) కామెంట్లు చేస్తేనే ఇండియాకు వస్తామని కొంతమంది హద్దులు దాటిన అభిమానంతో పెడుతున్న వీడియోలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.
కొన్నిరోజుల క్రితం కొంతమంది అమ్మాయిలు మేము పరీక్షలు రాయాలంటే విజయ్ దేవరకొండ కామెంట్ చేయాలని పోస్ట్ పెట్టారు.
విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) ఆ వీడియో గురించి స్పందిస్తూ తాను 90 శాతం మార్కులు తెచ్చుకుంటే కలుస్తానని మాట ఇచ్చాడు.
ఇప్పుడు ఒక అమ్మాయి జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )గురించి ప్రస్తావిస్తూ వీడియోను రిలీజ్ చేయడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.ఒక యువతి మాట్లాడుతూ ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఒక ట్రెండ్ నడుస్తోందని “ఫిజిక్స్ పాస్ అవ్వాలంటే నాసా వాళ్లు కామెంట్ పెట్టాలని నేను ఎగ్జామ్ కు ప్రిపేర్ అవ్వాలంటే విజయ్ దేవరకొండ కామెంట్ పెట్టాలి ఇది ఇన్ స్టాగ్రామ్ లో ట్రెండ్” అని యువతి కామెంట్లు చేశారు.

నేను ఇండియా రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ కామెంట్ పెట్టాలని ఆ యువతి చెప్పుకొచ్చారు.అయితే యువతి వీడియోపై నెటిజన్ల నుంచి పాజిటివ్ కామెంట్ల కంటే నెగిటివ్ కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఈ యువతి పేరు వల్లీభవిరెడ్డి ( Vallibhavireddy )అని సమాచారం.ఇన్ స్టాగ్రామ్ లో ఈ యువతికి 5 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.ఈ కామెంట్ తన దృష్టికి వస్తే ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి చిన్న చిన్న విషయాలకు స్పందించబోరని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో బిజీగా ఉన్నారు.మరో మూడేళ్ల పాటు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా గ్యాప్ లేకుండా బిజీగా ఉన్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.







