జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ఢిల్లీ పర్యటనపై ఇంకా క్లారిటీ రాలేదు.బీజేపీ అధినాయకత్వం పిలుపుకోసం జనసేనాని హైదరాబాద్ లో వేచి చూస్తున్నారని తెలుస్తోంది.
నిన్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం( Bhimavaram ) పర్యటనను పవన్ కల్యాణ్ అర్ధాంతరంగా ముగించుకుని హైదరాబాద్ కు వచ్చారు.ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం ఆయన హస్తినకు పయనం అవుతారని జోరుగా ప్రచారం జరిగింది.
కానీ పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లలేదు.దీంతో ఇవాళ ఆయన హస్తినకు వెళ్లి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా( Amit Shah )ను కలుస్తారని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఈ క్రమంలోనే అమిత్ షాతో భేటీ తరువాత పొత్తులపై పూర్తి క్లారిటీ వస్తుందని జనసేన వర్గాలు వెల్లడించాయి.