Pawan Kalyan Delhi Tour : పవన్ ఢిల్లీ పర్యటనపై రాని క్లారిటీ..!!

జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ఢిల్లీ పర్యటనపై ఇంకా క్లారిటీ రాలేదు.

బీజేపీ అధినాయకత్వం పిలుపుకోసం జనసేనాని హైదరాబాద్ లో వేచి చూస్తున్నారని తెలుస్తోంది.నిన్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం( Bhimavaram ) పర్యటనను పవన్ కల్యాణ్ అర్ధాంతరంగా ముగించుకుని హైదరాబాద్ కు వచ్చారు.

ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం ఆయన హస్తినకు పయనం అవుతారని జోరుగా ప్రచారం జరిగింది.

"""/" / కానీ పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లలేదు.దీంతో ఇవాళ ఆయన హస్తినకు వెళ్లి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా( Amit Shah )ను కలుస్తారని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ క్రమంలోనే అమిత్ షాతో భేటీ తరువాత పొత్తులపై పూర్తి క్లారిటీ వస్తుందని జనసేన వర్గాలు వెల్లడించాయి.

అలాంటి సన్నివేశాలు నా వల్ల కాదు.. సాయిధన్సిక షాకింగ్ కామెంట్స్ వైరల్!