UBC Tim Chen : ద్యావుడా.. రూమ్ రెంట్‌ కట్టలేక రోజూ విమానంలో కాలేజీకి వెళ్తున్న స్టూడెంట్..

సాధారణంగా సిటీలో ఇల్లు అద్దెకి తీసుకోవాలంటే చాలా డబ్బు వెచ్చించాల్సి వస్తుంది.కొంతమంది సొంత ఇంటి నుంచి కొంచెం దూరంగా ఉన్న ప్రదేశాల్లో ఆఫీసు లేదా స్కూల్ యూనివర్సిటీ ఉంటే దగ్గరిలోనే ఏదైనా రూమ్ రెంట్ తీసుకుంటారు.

 Ubc Student Tim Chen Flying From Calgary To Vancouver To Avoid High Rent-TeluguStop.com

కానీ ఆ రూమ్ రెంటు చాలా ఎక్కువగా ఉన్నా దూరాభారాన్ని నివారించడానికి అలానే భరిస్తారు.కానీ యూనివర్శిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా( University of British Columbia ) కి చెందిన టిమ్ చెన్( Tim Chen ) అనే విద్యార్థి ఇంటి రెంట్‌పై డబ్బు ఆదా చేయడానికి ఒక అదిరిపోయే ఆలోచన చేశాడు.

వాంకోవర్‌లోని ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకునే బదులు, అతను వారానికి రెండుసార్లు క్లాసుల కోసం కాల్గరీలోని తన ఇంటి నుండి వాంకోవర్‌కు విమానంలో ప్రయాణించాలని నిర్ణయించుకున్నాడు.

Telugu Avoid, Calgary, Cost Comparison, Travel, Method, Tim Chen, Ubc Tim Chen,

వారానికి రెండుసార్లు విమానంలో ( Flight ) ప్రయాణించడమంటే మాటలు కాదు.దానికి కూడా ఖర్చు బాగానే అవుతుంది కానీ రెంటు ఖర్చు కంటే ఆ విమానా టికెట్ల ఖర్చే తక్కువ గుర్తించాడు.టిమ్ యూనివర్సిటీలో మంగళవారాలు, గురువారాల్లో రెండు తరగతులకు హాజరవుతాడు.

అప్పుడు మాత్రమే అతను క్యాంపస్‌లో ఉంటే సరిపోతుంది.అదే రోజులలో విమాన ప్రయాణం చేస్తూ వాంకోవర్‌లో( Vancouver ) రెంట్ తీసుకోకూడదని ఈ స్టూడెంట్ నిర్ణయించుకున్నాడు.

అతను కాల్గరీలో( Calgary ) తన తల్లిదండ్రులతో ఉంటాడు, అంటే అతను కరెంటు, నీరు వంటి వాటికి మాత్రమే కొంచెం చెల్లించాలి.ప్రతి రౌండ్ ట్రిప్‌కు విమాన ప్రయాణ ధర సుమారు 150 డాలర్లు అట.

Telugu Avoid, Calgary, Cost Comparison, Travel, Method, Tim Chen, Ubc Tim Chen,

ఈ లెక్కన ప్రతి నెలా దాదాపు 1200 అతడు చెల్లించుకోవలసి వస్తుంది.అతను వాంకోవర్‌లో సింగిల్ బెడ్ రూమ్ అద్దెకు తీసుకున్నట్లయితే, నెలకు 2100 డాలర్లు ఖర్చు అవుతుంది.టిమ్ ఈ ఖర్చులకు సంబంధించిన వివరాలను రెడిట్‌లో పంచుకున్నాడు.ఇది ఒక తెలివైన మార్గం అని కొందరు అతడి రెడిట్‌ పోస్ట్‌పై కామెంట్ చేశారు.వాంకోవర్‌లో అధిక జీవన వ్యయాలు ఉన్నందున ప్రజలు ఇలానే చాలా దూరాలు ప్రయాణించవలసి వస్తోందని ఇంకొందరు పేర్కొన్నారు.అతను చెప్పిన లెక్క తప్పు అని ఆ డబ్బులు పెడితే హాయిగా ఒక రూమ్ దొరుకుతుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube