Director Atlee : ఎక్కడ అవమాన పడ్డాడో అక్కడే గౌరవం దక్కించుకున్నాడు డైరెక్టర్ అట్లీ

ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే కాదు నార్త్ ఇండియాలో కూడా పేరున్న సెలెబ్రిటీ గా మారిపోయాడు దర్శకుడు అట్లీ.( Director Atlee ) షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమా తీసిన తర్వాత అతని స్థాయి మరో రేంజ్ కి వెళ్ళిపోయింది.

 Director Atlee Relation With Shah Rukh Khan House-TeluguStop.com

అంతకన్నా ముందు అనేక సినిమాలతో తమిళ నాట స్టార్ డం సంపాదించుకున్న అట్లీ ఒక్కసారిగా ఫ్యాన్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిపోయాడు.అయితే ఇంతటి స్థాయి అందుకోవడానికి అతడు ఆడుకుంటూ పాడుకుంటూ ఏమి రాలేదు.

ఎన్నో కష్టాలను చూశాడు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.అందరి స్టార్స్ లాగానే తనకు ఎన్నో బాధలు ఉన్నాయి.అయితే షారుఖ్ ఖాన్ తో( Shahrukh Khan ) సినిమా తీస్తానని మాత్రం ఏ రోజు అనుకోలేదట.ఈ విషయం గురించి ఒక సంఘటన కూడా అట్లీ తన ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం.

ఇంకా గతంలో అట్లీ అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశాడు.శంకర్ దర్శకత్వంలో రోబో సినిమా( Robo Movie ) తెలుగెక్కుతున్న సమయంలో ఆ చిత్రానికి కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు.

Telugu Atlee, Atlee Struggles, Atlee Story, Jawan, Robo, Shahrukh Khan-Movie

అయితే ఈ సినిమా కి పని చేస్తున్న టైం లో ముంబైలో షూటింగ్ జరుగుతుందట.అక్కడే బ్యాండ్స్టాండ్ అనే రోడ్ లో షారుఖ్ ఖాన్ ఇల్లు( Shahrukh Khan House ) ఉంటుందని తెలుసుకున్న అట్లీ అక్కడికి వెళ్లి షారుక్ ఖాన్ ఇల్లు ఎలాగైనా చూడాలని అనుకున్నాడట.అంతేకాదు అక్కడ ఉన్న వాచ్ మెన్ తో షారుక్ ఖాన్ తో ఒక ఫోటో దిగడానికి అవకాశం దొరుకుతుందా అని ప్రయత్నాలు కూడా చేశాడట.కానీ ఆరోజు సాధారణ వ్యక్తిగా ఉన్న అట్లీ ని లోపలికి రానివ్వలేదు.

Telugu Atlee, Atlee Struggles, Atlee Story, Jawan, Robo, Shahrukh Khan-Movie

13 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏ టైం లో షారుక్ ఖాన్ ఇంటికి వెళ్లినా కూడా అదే రోడ్ లోని అదే ఇంట్లో ఉన్న షారుఖాన్ ఇంటి గేట్లు ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతాయి.ఇది కదా సక్సెస్ అంటే.కష్టపడితే ఎవరైనా కూడా ఎలాంటి స్థాయినైనా చేరుకోవచ్చు అని చెప్పడానికి అట్లీ జీవితంలో జరిగిన ఈ ఒక్క సంఘటన చాలు.మీరు కూడా మీ జీవితంలో ఏదైనా ఒక గోల్ పెట్టుకోండి ఇలాంటి ఫీట్స్ ఏమైనా చేయొచ్చు అలాగే ఎంతటి సక్సెస్ అయినా దక్కించుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube