ఐఫోన్ ఫీచర్లు( iPhone Features ) ఆండ్రాయిడ్ ఫోన్ ఫీచర్ల కంటే ఎంత మెరుగుగా ఉంటాయో అందరికీ తెలిసిందే.కష్టమైజేషన్ ఫీచర్ల విషయానికి వస్తే ఆండ్రాయిడ్ ఫోన్ల కంటే ఐఫోన్ల లోనే కాస్త తక్కువ ఫీచర్స్ ఉంటాయి.
అయితే యూజర్లకు సరిపడా ఫీచర్లు ఉన్నప్పటికీ ఐఫోన్ వినియోగించే చాలా మందికి తెలియని కొన్ని అద్భుతమైన ఫీచర్లు ఐఫోన్ లో ఉన్నాయి.ఆ ఫీచర్లు ఏమిటో తెలుసుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్ తో సమానమైన యూజర్ ఎక్స్పీరియన్స్ పొందవచ్చు.
బ్యాక్ ట్యాప్ స్క్రీన్ షాట్ ఫీచర్:
( Back Tap Screenshot Feature )ఐఫోన్ వెనుక భాగాన్ని రెండుసార్లు నొక్కడం ద్వారా స్క్రీన్ షాట్లు తీసుకోవచ్చని చాలామందికి తెలియదు.సెట్టింగ్స్ లోని యాక్సెసిబిలిటీ లో టచ్ లో బ్యాక్ ట్యాప్ లో డబుల్ ట్యాప్ ఆప్షన్స్ కి వెళ్లి స్క్రీన్ షాట్ తీసుకునేలా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు.స్క్రీన్ షాట్ తో పాటు ఫ్లాష్ లైట్ ఆన్ చేయడం ఫోన్ ను మ్యూట్ చేయడం కెమెరా ఓపెన్ చేయడం లాంటివి ఈ ఫీచర్ తో చేసుకోవచ్చు.
ఫ్లాష్ ఇంటెన్సిటీ అడ్జస్ట్ ఫీచర్:
( Flash Intensity Adjust Feature ) ఐఫోన్ కంట్రోల్ సెంటర్లో కనిపించే ఫ్లాష్ లైట్ ఐకాన్ ను నొక్కి పట్టుకుని బ్రైట్నెస్ ను అవసరాలకు అనుగుణంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
వీడియోలు,ఫోటోలకు సెక్యూరిటీ:
( Security for Videos, Photos ) వీడియోలు దాచి పెట్టేందుకు ఐటెంపై లాంగ్ ప్రెస్ చేసి, హైడ్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.ఫొటోస్ యాప్ ద్వారా కావలసిన ఫోటోలు లేదా వీడియోలను సెక్యూర్ ఫోల్డర్ లో దాచవచ్చు.హిడెన్ కంటెంట్ చూడాలంటే ఆల్బమ్స్ లోని హిడెన్ ఆప్షన్ కి వెళ్లి ఫేస్ ఐడీ టచ్ ఐడీ లేదంటే పాస్ వర్డ్ ఎంటర్ చేయాలి.
క్వైట్ లీ కాల్:
( Quiet Lee Call ) ఫీచర్ తో ఎలాంటి శబ్దం చేయకుండానే సైడ్ బటన్ ను మూడు సార్లు నొక్కడం ద్వారా ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కి కాల్ చేయవచ్చు.
థర్డ్ పార్టీ యాప్ కోసం ఫేస్ ఐడీ:
( Face ID for third party app ) సెట్టింగ్స్ లో ఫేస్ ఐడీ అండ్ పాస్ కోడ్ అనే ఆప్షన్ ఓపెన్ చేస్తే అక్కడ ఆథర్ యాప్స్ ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ ఫేస్ ఐడీని కావాల్సిన యాప్స్ కు ఆన్ చేయవచ్చు.
షేర్ కాంటాక్ట్ పోస్టర్:
( Share Contact Poster ) ఈ ఫీచర్ తో ఆటోమేటిగ్ గా ప్రొఫైల్ కాంటాక్ట్ పోస్టర్ ను కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేసుకోవచ్చు.సెట్టింగ్స్ లో షేర్ ఆటోమేటికల్లి అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.