వైసిపి ఈరోజు నిర్వహించబోతున్న సిద్ధం సభకు భారీగా ఏర్పాటు చేపట్టారు.అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ సిద్ధం సభను ఏర్పాటు చేశారు.
దీనికి భారీ ఏర్పాట్లు చేశారు.పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ఈ సిద్ధం సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
భీమిలి, దెందులూరులో జరిగిన సిద్ధం సభలకు లక్షల మంది కార్యకర్తలు తరలి రావడంతో, రాప్తాడు సభకు అంతే స్థాయిలో కార్యకర్తలు వస్తారని, ఈ సభా సూపర్ హిట్ అవుతుంది అని వైసీపీ అశలు పెట్టుకుంది.ఈ రోజు సిద్ధం సభలో జగన్ తన ప్రసంగాన్ని వినిపించబోతున్నారు.
ఈ సందర్భంగా వైసీపీ మేనిఫెస్టోను జగన్ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా వైసిపి వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇప్పటికే వైసీపీ అభ్యర్థుల ప్రకటన దాదాపు పూర్తి చేసిన జగన్, పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి పార్టీ నాయకులను తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.దానిలో భాగంగానే సిద్ధం పేరుతో భారీగా సభలను నిర్వహిస్తూ, పార్టీ నాయకులు, జనాల్లోనూ ఉత్సాహం పెంచే ప్రయత్నం చేస్తున్నారు.తమ రాజకీయ ప్రత్యర్తదులంతా కలిసినా, తమ విజయానికి డోఖా లేదు అని నిరూపించే ప్రయత్నం జగన్ చేస్తున్నారు.
ఇక జగన్ ప్రకటించబోయే కొత్త మేనిఫెస్టో పై భారీగా అంచనాలు ఉన్నాయి.ఇప్పటికే 2019 ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోను దాదాపు 98% పూర్తి చేసామని జగన్ పదేపదే చెబుతున్నారు.
గత మేనిఫెస్టోను మించి ఈ కొత్త మేనిఫెస్టో ఉండే అవకాశం కనిపిస్తుంది.
ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం సూపర్ సిక్స్ పేరుతో మేనిఫెస్టోను ప్రకటించి జనాల్లోకి వెళ్తోంది.దీంతో ప్రతిపక్షాలకు దీటుగా తమ మేనిఫెస్టోను జగన్ ప్రకటించేందుకు మేనిఫెస్టో రూపకల్పనకు ప్రత్యేకంగా ఒక టీం ను జగన్ ఏర్పాటు చేసుకున్నారు.ఈ కొత్త మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం ప్రకటిస్తారా లేదా అనేది క్లారిటీ రానుంది.
ఇప్పటికే టిడిపి ఉచిత బస్సు ప్రయాణం హామీని ఇచ్చింది.ఇక ఈ రోజు రాప్తాడు లో జరగబోయే సిద్ధం సభకు దాదాపు పది లక్షల మంది వరకు హాజరవుతారు అనే అంచనాలో వైసిపి ఉంది.