Ram Charan : వామ్మో ఈ చెవిటి పాత్ర చేయాలా అని కంగారు పడ్డారు రామ్ చరణ్..తర్వాత ఏమైంది?

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత( Ram Charan, Samantha ) హీరో హీరోయిన్స్ గా నటించిన రంగస్థలం సినిమా దాదాపు ఈ చిత్రంలో నటించిన అందరికి కూడా బిగ్గెస్ట్ హిట్టుగా అనుకోవచ్చు.అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ ని హీరో గా అనుకోవడానికి ముందు స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత అప్పటికే ధ్రువ షూటింగ్ తో బిజీగా ఉన్న చరణ్ ని ఓసారి కలుద్దామని సుకుమార్ సెట్టుకు వెళ్లాడట.

 Ram Charan Wants To Reject Rangasthalam Movie-TeluguStop.com

అక్కడ సినిమా షూటింగ్లో ఉన్న రాంచరణ్ కి కలిసి సుకుమార్ తన సినిమా గురించి చెప్పాలనుకున్నాడట.కానీ ఆ విషయాన్ని చెప్పడానికి ముందే రామ్ చరణ్ సుకుమార్ ని పలకరించి ఏంటి సుకుమార్( Sukumar ) నాతో సినిమా చేయడానికి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? ఏదైనా కథ ఉంటే చెప్పు.నేను చేయను అంటానా ? ఖచ్చితంగా నీ సినిమాలో నటించాలని ఉంది.నాన్నకు ప్రేమతో, వన్ నేనొక్కడినే లాంటి కథలు ఏమైనా నా కోసం తీసుకురావచ్చు కదా అని సరదాగా అన్నారట.

Telugu Aadhi Pinisetty, Climax, Ram Charan, Rangasthalam, Samantha, Sukumar-Movi

అయితే తను కథ చెప్పడానికే వచ్చానని అలాంటి కథలు ప్రస్తుతం చేయడం లేదని అవి బోర్ కొట్టేసాయని ఒక విలేజ్ పొలిటికల్ డ్రామా స్క్రిప్ట్ సిద్ధం చేశానని నువ్వు ఒకసారి వింటే బాగుంటుంది అని చెప్పాడట సుకుమార్.దాంతో రంగస్థలం సినిమా కథను రామ్ చరణ్ కి చెప్పడానికి టైం తీసుకున్నాడట సుకుమార్.కొంత కథ విన్న తర్వాత తనకు హీరో చెవిటి వాడు అన్న విషయం తెలిసి కాస్త భయం వేసిందట.పోయి పోయి ఇలాంటి

ఒక చెవిటి సినిమా పాత్ర

చేయడం తన కెరీర్ కి ఎలా ఉంటుందో అని భయపడ్డాడట రామ్ చరణ్.

Telugu Aadhi Pinisetty, Climax, Ram Charan, Rangasthalam, Samantha, Sukumar-Movi

అయితే క్లైమాక్స్( Climax ) తర్వాత వింటానని చెప్పి షూటింగ్ కి వెళ్ళిపోయాడట.కానీ మరుసటి రోజు ఖచ్చితంగా సుకుమార్ కి తను ఆ సినిమాలో నటించను అని చెప్పాలని నిర్ణయించుకున్నాడట.దానికన్నా ముందు ఓసారి కథ వింటే బాగుంటుందని పూర్తిగా క్లైమాక్స్ కూడా విన్నాడట.కానీ మొత్తం విన్న తర్వాత తనకు ఆ కథ చాలా బాగా నచ్చిందట.

ఎలా రిజెక్ట్ చేయాలి అనుకున్న సినిమాను సైతం సుకుమార్ నరేషన్ తో ఓకే చేశాడు రామ్ చరణ్.ఆ తర్వాత చిరంజీవి సైతం కథ చాలా బాగుంది అని చెప్పడంతో అందరూ కలిసి మొత్తానికి సినిమా చేసేసారు.

ఆ తర్వాత ఆ దాని ఫలితం ఏంటో మనందరికీ తెలిసిందేగా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube