తెలంగాణలో గొర్రెల కుంభకోణం కేసు( Sheep Distribution Scam )లో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది.విచారణలో భాగంగా గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాకు చెందిన రైతులను ఏసీబీ అధికారులు పిలిపించారు.
ఈ మేరకు సుమారు 15 మంది రైతులను పిలిచి ఏసీబీ( ACB ) వివరాలు అడిగి తెలుసుకున్నారు.సుమారు 120 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశామని రైతులు చెప్పారు.ఈ నేపథ్యంలో తమకు రూ.2.10 కోట్లు తమకు రావాలని తెలిపారు.మంత్రి తలసాని ఆదేశాలతో అధికారులు, కాంట్రాక్టర్ మొయినుద్దీన్ వచ్చారన్న రైతులు( Farmers ) గొర్రెలు తీసుకువెళ్లి డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు.