Chiranjeevi Nutan Prasad : మెగాస్టార్ చిరంజీవి మంచి మనస్సుకు నిదర్శనమిదే.. నూతన్ ప్రసాద్ కు ఇంత సహాయం చేశారా?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దగా ఉన్న విషయం తెలిసిందే.

 Megastar Chiranjeevi Helps Tollywood Senior Actor Nutan Prasad-TeluguStop.com

ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆయన పెద్ద దిక్కుగా ఉన్నారు.ఇండస్ట్రీ ఇబ్బందులు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి తన సొంత కుటుంబంలా టాలీవుడ్ ను చూసుకుంటున్నారు.

ఇప్పుడే కాదు ఎప్పటి నుంచి ఆయన ఆర్టిస్ట్ పట్ల మంచి మనసు చూపిస్తూనే ఉన్నారు.కష్టాల్లో ఉన్న తోటి ఆర్టిస్ట్ లతను ఆదుకోవడంలో మెగా స్టార్ ముందుంటారు అన్న విషయం తెలిసిందే.

గతలో చాలామంది చిరంజీవి గురించి ఆయన మంచితనం గురించి ఆయన చేసిన మంచి పనుల గురించి తెలిపారు.

అయితే రెండు దశాబ్ధాల క్రితం జరిగిన అలాంటి సంఘటన ఒకటి జరిగింది.

ఆ టైమ్ లో తన కో ఆర్టిస్ట్ ను మెగాస్టార్ ఆదుకోవడమే కాదు ఆపన్న హస్తం అందించారట.నూతన్ ప్రసాద్.( Nutan Prasad ) కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.కానీ బామ్మ మాట బంగారు బాట సినిమా లో భాగంగా ది గ్రేట్ లెజెండరీ ఆర్టిస్ట్ అయిన నూతన ప్రసాద్ గారు ఒక పెద్ద ప్రమాదానికి గురయ్యారు.

దాంతో ఆయన రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి.ఇక అప్పటి నుంచి ఆయన నిలబడి నడవ లేకుండా అయిపోయాడు.

దాంతో ఆయన వీల్ చైర్ కే పరిమితమయ్యాడు.

Telugu Nutan Prasad, Chiranjeevi, Nutanprasad, Tollywood-Movie

ఆ పరిస్థితి వల్ల నూతన ప్రసాద్ కి రకరకాల ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి.హెల్త్ పరంగా ఆర్ధికంగా నిలబడలేకపోయారు.కాళ్ళు పోవడంతో నూతన్ ప్రసాద్ కు సినిమాలు లేకుండా పోయాయి.ఆయనని సినిమాలో తీసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు.అలాంటి పరిస్థితుల్లో మంచి మనసుతో తన కో ఆర్టిస్ట్ ను ఆదుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ధన సహాయంతో( Financial Help ) పాటు సినిమాల్లో పాత్రలు( Movie Roles ) కూడా ఇప్పించారు.నిలబడి నటించలేకపోతే ఏమైయ్యింది వీల్ చైర్ లో ఉండి కూడా అద్భుతంగా నటించారు.

ఆయనలో ఆ తపనకు మెగాస్టార్ సాయం తోడై సినిమాలు చేయడం స్టార్ట్ చేశారట.

Telugu Nutan Prasad, Chiranjeevi, Nutanprasad, Tollywood-Movie

చిరంజీవి తన సినిమాల్లో ఏవైనా క్యారెక్టర్లు ఉంటే వాటిని ఆయన చేత చేయించడానికి ఎక్కువ ప్రయత్నించేవారు మాస్టర్ సినిమాలో( Master Movie ) ఒక క్యాంటీన్ ఓనర్ గా తన చేత నటింపజేశాడు చిరు.ఆయన వీలైనన్ని ఎక్కువ సీన్లలో కనిపించేలా కూడా చిరంజీవి దర్శకుడితో మాట్లాడి జాగ్రత్తలు తీసుకుని నూతన్ ప్రసాద్ కు ఆ గౌరవం దక్కేలా చేశారట.తను ఖాళీగా ఉంటే ఎప్పుడూ ఇబ్బంది పడతాడు, బాధపడతాడనే ఉద్దేశ్యంతో తనని ఎప్పటికప్పుడు బిజీగా ఉంచే ప్రయత్నం అయితే చేశాడట చిరు.

ఆ తర్వాత కూడా చాలామంది ఆయనకు మంచి మంచి పాత్రలు ఇచ్చి ఆయనను ప్రోత్సహించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube