ఈ మధ్య వస్తున్న మన పాన్ ఇండియా సినిమాల పాటల సంగతి మీకు ఇట్టే అర్థమయిపోయింది కదా.బాలీవుడ్ లో తీస్తున్న సినిమాకి తెలుగు డబ్బింగ్ లాగా ఉంటున్నాయి.
దీని కాదనగలరా ? ఉదాహరణకి ఆదిపురుష్, సాహో, రాదే శ్యాం వంటి చిత్రాలను తీసుకోండి.అవి కేవలం హిందీలోనే నిర్మాణం జరుపుకున్నట్టుగానే కనిపిస్తాయి.
కేవలం తెలుగులో వాయిస్ మార్చి వేశారేమో అన్న ఫీలింగ్ వస్తుంది.ఇక పాటల సంగతి మరీ చెప్పక్కర్లేదు.
దారుణంగా రాస్తున్నారు …డబ్బింగ్ సినిమా లాగానే ఉంటున్నాయి.అయితే ఈ మధ్య వచ్చిన ఆనిమల్ సినిమా( Animal ) విషయంలో మాత్రం ఈ తప్పు దొర్లకుండా చూసుకున్నాడు సందీప్ రెడ్డి వంగ.ఎందుకంటే ఆనీమల్ చిత్రం పూర్తి స్థాయిలో బాలీవుడ్ నేపథ్యంలోనే బాలీవుడ్ నటులతోనే తెరకెక్కింది.ఆ సినిమా నిజంగానే డబ్బింగ్ సినిమాలాగే రావాలి కానీ ఆ విషయంలో సందీప్ రెడ్డిని మెచ్చుకోకుండా ఉండలేము.

పాటలను పూర్తిస్థాయిలో స్పృహతోనే రాయించుకున్నాడు.పూర్తి తెలుగు పాటలాగే కనిపిస్తున్నాయి.అవి విన్న ప్రతిసారి అక్షర దోషాలు కనిపించకుండా ఎంతో చక్కగా తెలుగు పాటలు లాగానే కనిపించాయి.అందుకు సందీప్ రెడ్డివంగా ఎలాంటి సాహసం చేశాడో తెలిస్తే మీరు శభాష్ అనకుండా ఉండలేరు.
ఈ సినిమాలోని పాటలు అన్నీ కూడా అనంత శ్రీరామ్ రాశాడు.అయితే మొదట ఫ్లైట్ సీన్ గురించి చెప్పి దానికి తగ్గట్టుగా పాట రాయమని సందీప్ శ్రీరామ్ కి చెప్పాడట.
రెండు నెలల సమయం ఇచ్చినా కూడా పాటను పూర్తి చేయలేకపోయాడట.ఓ రోజు సందీప్ కి అనంత శ్రీరామ్( Anantha Sriram ) ఫోన్ చేసి ఆ సీన్ అలాగే దానికి సంబంధించిన ఎమోషన్ తెలియకుండా నేను పాట రాయలేకపోతున్నాను అని చెప్పాడట.

దాంతో ముంబైలోని తన ఆఫీసుకి దగ్గరలో సముద్రం వ్యూ కనిపించేలా హోటల్ రూమ్ ని బుక్ చేసి అలాగే ఆరు రోజుల్లో సినిమా ఎడిటింగ్ అంతా పూర్తి చేసి ఒక్కో రోజు సన్నివేశాన్ని అలాగే దాని ఎమోషన్ ని అర్థమయ్యేలా సినిమా వేసి చూపించాడట.అలా ఆరు రోజుల పాటు సినిమా చూసి 12 రోజుల్లో పాటలు పూర్తి చేసి ముంబై నుంచి హైదరాబాద్ కి వచ్చేసాడట అనంత శ్రీరామ్.ఇలా తెలుగు పాటల లాగా రావడానికి సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) ఒక లిరిక్ రైటర్ కి సినిమా ఎడిటింగ్ చేసి చూపించాడు అంటే దానికి ఆయన ఎంత జాగ్రత్త తీసుకున్నారో చెప్పాల్సిన అవసరం లేదు.







