Herbal Teas : షుగర్ 300 దాటిందా.. వర్రీ వద్దు ఈ హెర్బల్ టీలతో నార్మల్ చేసుకోండి!

మధుమేహం( Diabetes ).ప్రస్తుత రోజుల్లో కోట్లాది మందిని మదన పెడుతున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో ఒకటి.

 These Herbal Teas Help To Control Sugar Levels Quickly-TeluguStop.com

ఈ మొండి వ్యాధిని నయం చేయడం చాలా కష్టం.కానీ అదుపులో ఉంచుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది.

పెద్దవారిలో చక్కెర స్థాయిలు భోజనానికి ముందు 70 నుండి 130 ఎమ్‌జీ/డీఎల్‌ ఉండాలి.అలాగే భోజనం తర్వాత 140 ఎమ్‌జీ/డీఎల్‌ కంటే తక్కువగా ఉండాలి.అప్పుడే షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉన్నట్టు.అయితే ఒక్కోసారి కొందరికి షుగర్ 300, 400 దాటేస్తుంటుంది.ఫ‌లితంగా తీవ్ర‌మైన అలసట, తలనొప్పి, చూపు మంద‌గించ‌డం, తరచుగా మూత్రవిసర్జన, అధిక దాహం, ఉన్న‌ట్లు బ‌రువు త‌గ్గ‌డం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.

Telugu Aloe Vera Tea, Chamomile Tea, Cinnamon Tea, Diabetes, Diabetic, Tips, Her

అంతేకాదు అదే రేంజ్ లో షుగర్ లెవెల్స్( Sugar Levels ) కంటిన్యూ అయితే బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు, కిడ్నీ ఫెయిల్యూర్, మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ వంటివి జరిగే రిస్క్ కూడా ఉంటుంది.కాబట్టి ఎల్లప్పుడూ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలి.అందుకు ఇప్పుడు చెప్పబోయే హెర్బల్ టీలు( Herbal Tea ) చాలా అద్భుతంగా సహాయపడతాయి.

ఈ జాబితాలో మొదట చెప్పుకోవాల్సింది కలబంద టీ( Aloevera Tea ).షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయని వర్రీ అవుతున్న వారు ఖాళీ కడుపుతో రోజు ఒక కప్పు కలబంద టీ ను తీసుకోండి.

ఇలా చేశారంటే చాలా వేగంగా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి.

Telugu Aloe Vera Tea, Chamomile Tea, Cinnamon Tea, Diabetes, Diabetic, Tips, Her

అలాగే మధుమేహులకు దాల్చిన చెక్క టీ( Cinnamon Tea ) కూడా చాలా మేలు చేస్తుంది.రోజుకు ఒక కప్పు దాల్చిన చెక్క టీను తీసుకుంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగు పడుతుంది.భారీగా పెరిగిన షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లోకి తెస్తుంది.

చమోమిలే టీ.దీనినే చామంతి టీ( Chameleon Tea ) అని కూడా పిలుస్తాము.మధుమేహం ఉన్నవారికి ఈ టీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.ఈ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడానికి హెల్ప్ చేస్తాయి.షుగ‌ర్ ను కంట్రోల్ చేస్తాయి.ఇక ఈ హెర్బల్ టీలతో పాటు నిత్యం అరగంట వ్యాయామం చేయండి.

పోషకాహారాలను డైట్ లో చేర్చుకోండి.ఒత్తిడికి దూరంగా ఉండండి.

కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోండి.మరియు మద్యపానం, ధూమపానం అలవాట్లను మానుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube