జీమెయిల్( Gmail ) వినియోగదారుల కోసం ఓ సరికొత్త అప్డేట్ త్వరలోనే పరిచయం చేసేందుకు గూగుల్ ప్రయత్నిస్తోంది.ఈమెయిల్ రిప్లై కోసం చాట్ స్టైల్ ఇంటర్ఫేస్ ను ( Chat Style Interface ) మరో మూడు నెలల్లో జీమెయిల్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.
ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.ఈ మెయిల్స్ కు రిప్లై ఇవ్వడం మరింత సులభతరం అవుతుంది.
సాధారణంగా ఈమెయిల్ ( Email ) ఓపెన్ చేస్తే.కింద రిప్లై బాక్స్ కనిపిస్తుంది.ఆ రిప్లై బాక్స్ లో మనం సమాధానం రాసి పంపిస్తాం.అయితే ఈ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చాక ఈమెయిల్ రిప్లై బాక్స్ ఇంటర్ ఫేస్ ఇకపై మనకు చాట్ స్టైల్ లో కనిపిస్తుంది.
ఈమెయిల్ ఓపెన్ చేస్తే కింద కనిపించే రిప్లై, రిప్లై ఆల్, ఫార్వర్డ్, ఎమోజీ ఆప్షన్లు కనిపిస్తాయి.ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక ఆ ఆప్షన్లన్నీ ఈమెయిల్ పై భాగంలో కనిపిస్తాయి.
పిల్ షేప్ కంటైనర్లు, బటన్స్, అటాచింగ్ మీడియా, ఎమోజీ ఈమెయిల్ పై భాగంలో ఉంటాయి.

ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక యూజర్లకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటే.గూగుల్ చాట్ ఇంటర్ ఫేస్( Google Chat Interface ) యూజర్లకు బాగా ఉపయోగపడుతుంది.జీమెయిల్ కు వచ్చిన మెయిల్స్ లేదంటే పంపించిన మెయిల్స్ ను ఫుల్ స్క్రీన్ లో చూసుకోవచ్చు.
ఈమెయిల్ కంపోజ్ చేసేటప్పుడు కీబోర్డ్ కనిపిస్తుంది.రిసిపెంట్ వివరాలు స్క్రీన్ ఎడమవైపున, సెండ్ బటన్ కుడివైపున ఉంటాయి.

ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది.త్వరలోనే జీమెయిల్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.స్మార్ట్ ఫోన్ పనిచేయాలంటే జీమెయిల్ ఉండాల్సిందే.అన్నింటికీ జీమెయిల్ ను ప్రాథమికంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.కాబట్టి యూజర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని జీమెయిల్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది.







