శిథిలావస్థకు చేరుకున్న వాటర్ హెడ్ ట్యాంక్...!

నల్లగొండ జిల్లా: అడివిదేవులపల్లి మండల కేంద్రంలో ప్రజల నీటి అవసరాల కోసం 17 ఏళ్ల క్రితం 2007లో నిర్మించిన రక్షిత మంచినీటి సరఫరా వాటర్‌ హెడ్ ట్యాంక్‌ పూర్తిగా శిథిలావస్థకు చేరి,ఎప్పుడు కూలిపోతుందో తెలియని ప్రమాదకర పరిస్థితిలో ఉందని, ఎన్నిసార్లు విన్నవించినా పాలకుల నుండి కనీస స్పందన కరువైందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.శిథిలావస్థకు చేరిన ఈ ట్యాంకు తొలగింపుపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడంతో

 Dilapidated Water Head Tank At Adividevulapalli Mandal, Water Head Tank ,adivide-TeluguStop.com

ఎప్పుడు కూలిపోతుందోనని కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.

ట్యాంక్‌ పెచ్చులు ఊడిపోతూ పడిపోయేందుకు సిద్ధంగా ఉన్నా ఎందుకు తొలగించటం లేదని,ఏదైనా జరగరానిది జరిగి,ప్రాణనష్టం జరిగితేనే అధికార యంత్రాంగం స్పందిస్తారా అని ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని,వెంటనే వాటర్ ట్యంక్ తొలగించి, నూతనంగా నిర్మించాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube