శిథిలావస్థకు చేరుకున్న వాటర్ హెడ్ ట్యాంక్…!

శిథిలావస్థకు చేరుకున్న వాటర్ హెడ్ ట్యాంక్…!

నల్లగొండ జిల్లా: అడివిదేవులపల్లి మండల కేంద్రంలో ప్రజల నీటి అవసరాల కోసం 17 ఏళ్ల క్రితం 2007లో నిర్మించిన రక్షిత మంచినీటి సరఫరా వాటర్‌ హెడ్ ట్యాంక్‌ పూర్తిగా శిథిలావస్థకు చేరి,ఎప్పుడు కూలిపోతుందో తెలియని ప్రమాదకర పరిస్థితిలో ఉందని, ఎన్నిసార్లు విన్నవించినా పాలకుల నుండి కనీస స్పందన కరువైందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

శిథిలావస్థకు చేరుకున్న వాటర్ హెడ్ ట్యాంక్…!

శిథిలావస్థకు చేరిన ఈ ట్యాంకు తొలగింపుపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడంతో ఎప్పుడు కూలిపోతుందోనని కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.

శిథిలావస్థకు చేరుకున్న వాటర్ హెడ్ ట్యాంక్…!

ట్యాంక్‌ పెచ్చులు ఊడిపోతూ పడిపోయేందుకు సిద్ధంగా ఉన్నా ఎందుకు తొలగించటం లేదని,ఏదైనా జరగరానిది జరిగి,ప్రాణనష్టం జరిగితేనే అధికార యంత్రాంగం స్పందిస్తారా అని ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని,వెంటనే వాటర్ ట్యంక్ తొలగించి, నూతనంగా నిర్మించాలని కోరుతున్నారు.

పేకాట మత్తులో నటుడు…. రాజీవ్ కనకాల వద్ద రూ.350 కోట్లు అప్పు చేశారా?

పేకాట మత్తులో నటుడు…. రాజీవ్ కనకాల వద్ద రూ.350 కోట్లు అప్పు చేశారా?