యాదాద్రి భువనగిరి జిల్లా:( Yadadri Bhuvanagiri District ) మోత్కూరు పట్టణానికి చెందిన గుర్రం మోహన్ రెడ్డి కుమారుడు గుర్రం సాయికృష్ణారెడ్డి ( Gurram Saikrishna Reddy )ఇటీవల విడుదలైన గ్రూప్ 4 ( Group 4 )ఫలితాల్లో 300 మార్కులకు గాను 210 మార్కులు సాధించి జిల్లా మొదటి ర్యాంకు,స్టేట్ 20వ ర్యాంక్ సాధించాడు.
సోమవారం మోత్కూరులో సాయికృష్ణారెడ్డి విలేకరులతో మాట్లడుతూ సాయికృష్ణ అనురాగ్ యూనివర్సిటీలో ఈసిఈ లో బీటెక్ పూర్తి చేసి, అనంతరం సాఫ్ట్వేర్ జాబ్ మాని గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు.
గతేడాది జరిగిన గ్రూప్ 1 పరీక్షలో మెయిన్స్ కు ఎంపికైనా,తదుపరి ఆ పరీక్ష రద్దయిన విషయం తెలిసిందే అన్నారు.ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతంగానే ప్రిపేరవుతున్నట్టు,గ్రూప్ 1 సాధించడమే లక్ష్యంగా పట్టుదలతో చదువుతున్నట్టు పేర్కొన్నాడు.







