తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు.ఈయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా 40 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో మెగాస్టార్ గా కొనసాగుతున్నాడు.
ఇక ఇలాంటి క్రమం లోనే చిరంజీవి కొత్త సినిమాలను చేస్తూ యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఒకానొక సమయంలో చిరంజీవి చాలా సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకున్నాడు.వరుసగా 6 సంవత్సరాల్లో 6 ఇండస్ట్రీ హిట్ల ను కొట్టిన ఏకైక హీరోగా కూడా చిరంజీవి తనదైన మార్క్ గుర్తు తెచ్చుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలో చిరంజీవి వాళ్ళ మామయ్య అయిన అల్లు రామలింగయ్య ( Allu Ramalingaiah )ఒక సినిమా విషయంలో చిరంజీవిని ముందుగానే హెచ్చరించినప్పటికీ ఆయన అవేమీ పట్టించుకోకుండా సినిమా చేసి భారీ ఫ్లాప్ ను మూట గట్టుకున్నాడు.
అది ఏ సినిమా అంటే విజయ బాపినీడు( Vijaya Bapineedu ) దర్శకత్వంలో వచ్చిన బిగ్ బాస్.
ఈ సినిమా స్టోరీ విన్న చిరంజీవి( Chiranjeevi ) ఆ స్టోరీని అల్లు రామలింగయ్య గారితో చెప్పాడట.దాంతో అల్లు రామలింగయ్య ఆ కథలో పెద్దగా స్పార్క్ లేదు నువ్వు చేయకపోతే బెటర్ చిరంజీవి అని కొన్ని మార్పులు చేర్పులు చేపించి ఆ సినిమాని తెరకెక్కించాడు ఇక అల్లు రామలింగయ్య చెప్పినట్టుగానే ఈ సినిమా భారీ డిజాస్టర్ ని మూట గట్టుకుంది.ఇక దాంతో చిరంజీవి ఖాతాలో ఒక ఫ్లాప్ సినిమా చేరింది.
అందువల్లే ఇక చిరంజీవి అప్పటి నుంచి ఎవరు ఏం చెప్పిన కూడా మనం దాని గురించి ఒకసారి వినాలి అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడట…అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు చిరంజీవి తను విన్న ప్రతి స్టోరీ లో కొంతమంది సలహాలు తీసుకున్నట్టు గా కూడా తెలుస్తుంది.